HAMSA VAHANA SEVA HELD _ హంస వాహనంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి క‌టాక్షం

Tirupati, 20 Jun. 21: As a part of the ongoing annual brahmotsavams, at Appalayagunta, on Sunday evening, Hamsa vahanam held with religious fervor following covid norms.

Sri Prasanna Venkateswara Swamy dressed as a Saraswati Devi bless the devotees holding Veena on Hamsa Vahana.

Temple officials took part in this vahana seva.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హంస వాహనంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి క‌టాక్షం

తిరుపతి, 2021 జూన్ 20: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం సాయంత్రం స‌ర‌స్వ‌తి అలంకారంలో స్వామివారు హంస‌ వాహనంపై ద‌ర్శ‌న‌మిచ్చారు.

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు వీణ ధరించి సరస్వతీ రూపంతో అనుగ్రహించారు. సారం లేనిదాన్ని వదలి, సారవంతమైన దాన్ని స్వీకరించే ఉత్తమ జ్ఞానానికి హంస సంకేతం. హంస సరస్వతి అమ్మ‌వారికి వాహనం. కనుక స్వామివారు సరస్వతీ రూపంతో వీణాపుస్తకపాణియై దర్శనమివ్వడం జ్ఞాన విజ్ఞాన చైతన్య శుద్ధసత్త్వగుణానికి నిదర్శనం. భక్తులు హంసల వలె నిర్మల మనస్కులై ఉంటే, వాళ్ల హృదయాల్లో తాను శాశ్వతంగా ఉంటానని ఈ వాహనం ద్వారా స్వామివారు తెలియ‌జేస్తున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు మ‌రియు కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సూర్య‌కుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ గోపాల కృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీ‌నివాసులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.