HAMSA VAHANAM HELD _ హంస వాహనంపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడు

Vontimitta, 11 April 2022: On the second day evening of the ongoing Sri Ramanavami Brahmotsavam at Vontimitta in YSR Kadapa district on Monday evening, Sri Rama flanked by Sita Devi and Lakshmana Swamy took a celestial ride on Hamsa Vahanam.

Sri Kodandarama blessed His devotees on the celestial carrier.

According to legends, Hamsa has the capacity to separate milk from water, which is nothing but the divine wisdom of Parabrahma Swarupam.

Earlier Unjal Seva took place with divine fervour.

The Annamacharya Sankeertana by renowned artist Dr G Madhusudhan Rao has provided a musical feast to the devotees.

DyEO Dr Ramana Prasad, AEO Sri Subramaniam, Superintendent Sri P Venkateshaiah, Temple Inspector Sri R Dhananjay and others were present.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

హంస వాహనంపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడు
 
 ఒంటిమిట్ట, 2022 ఏప్రిల్ 11: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. రాత్రి 9.30 గంటల వరకు వాహనసేవ జరుగనుంది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. 
 
ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. ‘సోహం’ భావం కలిగిన భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.
 
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈఓ డా. రమణప్రసాద్, ఏఈఓ శ్రీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ శ్రీ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఆర్.ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.