MISCONCEIVED CAMPAIGN ON TTD VOER NEGLECT OF ANNAMAIAH- TTD ADDITIONAL EO _ తిరుమ‌ల‌లో అన్న‌మ‌య్య నివ‌సించిన స్థ‌లాన్ని నిర్లక్ష్యం చేస్తోంద‌ని టిటిడిపై దుష్ప్రచారం

Tirumala, 11 April 2022: TTD Additional EO Sri AV Dharma Reddy denied reports by a section of media and social media over the neglect of the place where Saint Poet Sri Tallapaka Annamacharya who once lived at Tirumala and said TTD held Annamaiah and his family in high esteem and given prominence to his principles of Bhakti in a big manner.

Addressing a media conference at Annamaiah Bhavan in Tirumala on Monday evening, the TTD Additional EO said during the implementation of the master plan on Mada streets in 2003 the statues of Annamaiah and others were taken away by respective mutts etc.

Since the statues were not installed as per Agama shastras, they were not offered dhoop and Deepa rituals and baseless to say Balalaya was observed during the eviction of statues.

He said in 2007 Agama pundits had opposed installing and pujas of any idols other than Srivari idols on Mada streets.

The Additional EO gave ample instances of importance being given to Sri Annamacharya-

1.    Annamaiah ancestors daily participate in Srivari temple kainkaryars of suprabata Seva, kalyanotsava, Ekantha seva etc.

2.    As part of the master plan all Mutts and locals were evacuated from Mada streets and rehabilitated in other locations.

3. All Annamaiah successors were provided traditional honours at Srivari temple.

4.Two sankeertans of Annamaiah were sung during Sahasra Deepalankara seva every day.

5. ₹25 crore allocated to the Annamaiah Project established about 45 years ago.

6. 14,932 Annamaiah sankeertans are accessible to all common devotees today.

7. 25 Literary pundits are involved in vigorous research on Annamaiah sankeertans.

8. 4400 sankeertans have been tuned and accessible to devotees through YouTube and SVBC portals while another 1000 sankeertans will be done soon.

9.  Since1995 Annamaiah Vardhanti and Jayanti are being celebrated annually.

10. TTD has installed 108 feet Annamaiah statue at Tallapaka.

11. Very recently State government has also created an exclusive district named after Annamaiah.

12. In 2012 when Annamacharya successors sought installation of the Annamaiah statue on Mada Street, TTD board had rejected the demand.

13. The SVBC has launched programs of Annamaiah sankeertans for youth through ‘Adivo Alladivo’, ‘Annamaiah Pataku Pattabhishekam ‘etc. and created zeal among the youngsters to learn new sankeertans of Annamacharya and popularize the same among masses.

Annamacharya Project Director Dr A Vibhishana Sharma and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమ‌ల‌లో అన్న‌మ‌య్య నివ‌సించిన స్థ‌లాన్ని నిర్లక్ష్యం చేస్తోంద‌ని టిటిడిపై దుష్ప్రచారం

– నేటికి అన్న‌మ‌య్య వంశీయులు శ్రీ‌వారి సేవ‌ల్లో పాల్గొంటున్నారు

– అన్న‌మాచార్యుల‌వారికి, వారి వార‌సుల‌కు అత్యున్న‌త గౌర‌వం

– అన్న‌మ‌య్య సాహిత్యాన్ని టిటిడి విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది

– అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2022 ఏప్రిల్ 11: తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారు తిరుమ‌ల‌లో నివ‌సించిన స్థ‌లాన్ని నిర్లక్ష్యం చేస్తోంద‌ని కొన్ని ప‌త్రిక‌లు,సామాజిక మాధ్యమాల్లో టిటిడి పై దుష్ప్రచారం చేస్తున్నాయ‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో సోమ‌వారం అద‌న‌పు ఈవో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్బంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ 2003లో తిరుమల మాస్టర్ ప్లాన్‌లో భాగంగా శ్రీ వరాహ స్వామి ఆలయం వెనుక మ‌ఠాలు, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలు తొలగించార‌న్నారు. ఈ సంద‌ర్బంగా ఆయా మ‌ఠాల నిర్వాహ‌కులు ఆ విగ్రహాలను తమతోపాటు తీసుకెళ్లార‌ని తెలిపారు. శ్రీ వరాహస్వామి ఆలయ పరిసరాల్లో ఉన్న అన్నమయ్య, ఆంజనేయ స్వామి విగ్రహాలను కూడా అన్నమయ్య వంశస్థులు తీసుకెళ్లార‌ని తెలిపారు. ఆ విగ్రహాలు ఆగమశాస్త్రం ప్రకారం ప్రతిష్ఠింపబడ లేద‌ని, పూజలందుకో లేద‌ని చెప్పారు. విగ్రహాలను తరలించే సమయంలో బాలాల‌యం నిర్వహించార‌న్న‌ది అవాస్తమ‌న్నారు.

2007లో తిరుమల నాలుగు మాడ వీధుల‌ను సందర్శించిన కొంతమంది సాధువులు విగ్రహాలను ప్రతిష్టించాల‌ని ప్రతిపాదించ‌గా, ఆగమ సలహా మండ‌లి మాడవీధుల్లో శ్రీవారు తప్ప వేరే విగ్రహాలను పూజించకూడ‌ద‌ని నివేదిక సమర్పించింద‌న్నారు.

శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ, కళ్యాణోత్సవం, ఏకాంత సేవల్లో అన్నమయ్య వంశీకులు పాల్గొంటున్నార‌న్నారు.

అన్నమయ్య వంశీకులకు శ్రీవారి ఆలయంలో సంప్రదాయబద్దంగా వస్తున్న గౌరవ మర్యదలు కల్పిస్తున్నామ‌న్నారు.

– ప్రతిరోజు సహస్ర దీపాలంకరణ సేవలో అన్నమాచార్యులవారి సంకీర్తనలు ఆలపిస్తార‌ని చెప్పారు.

– మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా నాలుగు మాడ వీధులలో మఠాలతో పాటు స్థానికుల నివాసాలను తొలగించామ‌ని, వారికి ప్రత్యామ్నాయంగా తిరుమ‌ల, తిరుప‌తిలో పునరావాసం కల్పించామ‌న్నారు.

– అన్నమయ్య సంకీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకుని రావాల‌నే లక్ష్యంతో 45 సంవత్సరాల క్రితం అన్నమచార్య ప్రాజెక్టు ఏర్పాటు చేసి, ప్రతి ఏటా 25 కోట్లు కేటాయిస్తూన్నామ‌ని తెలిపారు.

– 14 వేల 932 అన్నమయ్య కీర్తనలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయ‌న్నారు. 25 మంది ప్ర‌ముఖ పండితులతో క‌మిటీ ఏర్పాటు చేసి అన్నమయ్య కీర్తనల అర్థ తాత్ప‌ర్యాలు పొందు పరుస్తున్నట్లు చెప్పారు.

– 4445 సంకీర్తనలు ఇప్పటి వరకు స్వర పర్చర‌ని, వీటిని ఎస్వీబిసి, యూ ట్యూబ్‌, టిటిడి వెబ్‌సైట్‌లో ఉంచామ‌న్నారు. మ‌రో వెయ్యి కీర్తనలు స్వరపర్చే కార్యక్రమాని ప్రారంభించామ‌న్నారు.

– 1995వ సంవ‌త్స‌రం నుండి అన్నమయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రతి సంవత్సరం టిటిడి ఘ‌నంగా నిర్వహిస్తోందన్నారు.

– తాళ్లపాకలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని టిటిడి ఏర్పాటు చేసింద‌న్నారు.

– ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం నూతన జిల్లా పేరును అన్నమయ్య జిల్లాగా నామకరణం చేసింద‌ని వివ‌రించారు.

– 2012వ సంవత్సరం అన్నమయ్య వంశీకులు తిరుమాడ వీధుల్లో అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరగా ఆగమ సలహామండలి దీనిని తిరస్కరించిందన్నారు.

-. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో యువ కళాకారులతో అన్నమయ్య సంకీర్తనల పై అదివో అల్లదివో కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇదివరకే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం లాంటి అనేక గొప్ప కార్యక్రమాలను కూడా నిర్వహించి ప్రసారం చేసిందని శ్రీ ధర్మారెడ్డి వివరించారు

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.