HANUMAN BIRTHPLACE BHOOMI PUJA AT TIRUMALA ON FEBRUARY 16 _ ఫిబ్రవరి 16న తిరుమలలో హనుమాన్ జన్మస్థలం భూమి పూజ ‍: టిటిడి ఈవో

Tirumala, 4 February 2022: The Bhoomi Puja for Hanuman Birth place at Anjanadri in Tirumala will be performed on February 16 on the auspicious day of Magha Pournami, said TTD EO Dr KS Jawahar Reddy.

 

Speaking with media after the review meeting at Annamaiah Bhavan in Tirumala on Friday he said, TTD has already declared Anjanadri near Akasa Ganga at Tirumala as Birth place of Sri Anjaneya with epigraphic, geographic and scientific evidences. In this connection it has been decided to develop this area as a place of pilgrimage and TTD has taken up beautification for which the Bhoomi Puja will be performed on February 16.

 

“We have invited spiritual exponents viz. Visakha Sharada Peetham Pontiff Sri Swaroopananda Saraswati Swamy, Rama Janmabhoomi Trust Treasurer Sri Govindadev Giri Maharaj, Chitrakoot Seer Sri Ramabhadracharyulu, Sri Koteswara Sarma and others for the fete. The entire event will be telecasted live on SVBC from 9:30am onwards for the sake of global devotees”, EO maintained.

 

Earlier in the review meeting, Additional EO Sri AV Dharma Reddy, National Sanskrit Varsity Professor Rani Sadasiva Murty, SV Institute of Higher Vedic Studies Project officer Dr A Vibhishana Sharma and others were also present.

 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఫిబ్రవరి 16న తిరుమలలో హనుమాన్ జన్మస్థలం భూమి పూజ ‍: టిటిడి ఈవో

తిరుమల, 2022 ఫిబ్ర‌వ‌రి 04: తిరుమలలోని అంజనాద్రిలో హనుమంతుని జన్మస్థలానికి భూమి పూజను ఫిబ్రవరి 16న మాఘ పౌర్ణమి నాడు నిర్వహించనున్నట్లు టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వ‌హించారు.

అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమలలోని ఆకాశ గంగ సమీపంలోని అంజనాద్రిని శ్రీ ఆంజనేయుడి జన్మస్థలంగా భౌగోళిక, పౌరాణిక‌, శాస్త్రోక్తమైన ఆధారాలతో టిటిడి ప్రకటించింద‌న్నారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి, సుందరీకరణ చేపట్టేందుకు టిటిడి ఫిబ్రవరి 16న భూమిపూజ నిర్వహించనున్న‌ట్లు తెలిపారు.

విశాఖ శారద పీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామి, అయోధ్య శ్రీ రామ‌జ‌న్మ భూమి ఆల‌య నిర్మాణ ట్ర‌స్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్‌, చిత్రకూట్ పీఠాధిపతి శ్రీ రామభద్రాచార్యులు, శ్రీ కోటేశ్వ‌ర‌ శ‌ర్మ‌ తదితర ఆధ్యాత్మిక ప్రముఖులను ఈ ఉత్సవానికి ఆహ్వానించామ‌న్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భ‌క్తుల కొర‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని ఉద‌యం 9.30 గంట‌ల నుండి ఎస్వీబిసిలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తామ‌న్నారు.

ఈ సమీక్షా సమావేశంలో జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు రాణి సదాశివమూర్తి, ఎస్వీ ఉన్నాత‌ వేద ఎస్వీ ఉన్న‌త వేద అధ్య‌య‌న‌ సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.