HANUMAN JAYANTI OBSERVED _ తిరుమలలో ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు
TIRUMALA, 22 MAY 2025: Hanuman Jayanti was observed in a grand manner at Bedi Anjaneya Swamy temple and also at the 7th Mile Prasanna Anjaneya statue by TTD on Thursday.
Earlier, special pujas, including Tirumanjana Abhishekam, were performed to Sri Bedi Anjaneya Swamy.
TTD Chairman Sri BR Naidu, Additional EO Sri Ch Venkaiah Chowdary, temple DyEO Sri Lokanatham and others were also present.
At the gigantic statue of Sri Prasanna Anjaneya Swamy located in the 7th Mile of Down Ghat road, special Pujas and Asthanam were performed in the evening amidst chanting of Vedic mantras in the accompaniment of Nada Swaram and Dolu.
Later Prasadams were distributed to the devotees.
Additional EO Sri Ch Venkaiah Chowdary, temple DyEO Sri Lokanatham VGOs Sri Ramkumar, Sri Surendra, Health Officer Dr Madhusudhan wnd others were also present.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు
తిరుమల, 2025 మే 22: హనుమజ్జయంతి సందర్భంగా గురువారం తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయంలో, మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఉన్న ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహం వద్ద టీటీడీ ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.
శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి ఉదయం అభిషేకం సహా పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ శ్రీ బి ఆర్ నాయుడు, అదనపు ఈఓ శ్రీ సి హెచ్. వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
కాగా సాయంత్రం 3 గంటలకు మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహం విగ్రహం వద్ద వేద మంత్రోచ్చారణలు మేళతాళాల నడుమ ప్రత్యేక పూజలు, అస్థానం వేడుకగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈఓ శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం, వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, ఆరోగ్య అధికారి డాక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.