HANUMANTHA VAHANA SEVA AT APPALAYAGUNTA _ హనుమంత వాహనంపై కోదండ‌రాముని అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి

TIRUPATI, 15 JUNE 2022: Hanumantha Vahana Seva was held at Sri Prasanna Venkateswara Swamy temple in Appalayagunta on Wednesday.

As a part of ongoing annual Brahmotsavams on sixth day morning, in Kodanda Rama Alankara, Sri Prasanna Venkateswara blessed His devotees on Hanumantha Vahanam.

In the evening Vasanthotsavam will be observed between 3pm and 4pm.

Kankanabhattar Sri Suryakumaracharyulu, Superintendent Smt Srivani and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హనుమంత వాహనంపై కోదండ‌రాముని అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి

తిరుపతి, 2022, జూన్ 15: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన బుధ‌వారం ఉదయం హ‌నుమంత వాహ‌నంపై కోదండ‌రాముని అలంకారంలో స్వామివారు ద‌ర్శ‌మిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.

హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడిగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధిచెందాడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచనగావించిన మహనీయులు కనుక వీరిని ద‌ర్శించిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

మ‌ధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు పుణ్యాహవచనం, వసంతోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8 నుండి 9 గంటల వరకు గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సూర్య‌కుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.