HANUMANTHA VAHANA SEVA HELD _ హ‌నుమంత వాహ‌నంపై కోదండ రామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

Tirumala,23 September 2023: On the sixth day morning of the ongoing annual Brahmotsavam, Sri Malayappa Swamy took a celestial ride on His humble and noble devotee Hanumantha as Kodandarama to bless His devotees.

Hanuman symbolically stands for pure devotion, complete surrender (saranagati) and absence of ego. By taking pride ride on Hanumantha Vahana,  the Lord sent a message to His devotees that anybody can attain divinity if they are noble in their deeds.

The TTD EO Sri AV Dharma Reddy and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

హ‌నుమంత వాహ‌నంపై కోదండ రామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

తిరుమ‌ల‌, 2023 సెప్టెంబ‌రు 23: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శ‌నివారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
`
హ‌నుమంత వాహ‌నం – భ‌గ‌వ‌త్ భ‌క్తి ప్రాప్తి

హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్య ఫలం లభిస్తుంది.

సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వ‌ర్ణ‌ర‌థంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు భక్తులను కటాక్షిస్తారు. రాత్రి 7 గంటలకు గ‌జ‌వాహనంపై స్వామివారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

వాహనసేవల‌లో తిరుమ‌ల‌ శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయర్ స్వామి. తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, ఢిల్లీ స్థానికి స‌ల‌హా మండ‌లి అధ్య‌క్షురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, జేఈవో లు శ్రీమ‌తి స‌దాభార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.