HANUMANTHA VAHANA SEVA HELD _ హనుమంత వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల విహారం

VONTIMITTA, 03 APRIL 2023: As part of the ongoing annual brahmotsavam at Vontimitta Kodanda Ramalayam, Hanumantha Vahana Seva was held with utmost religious fervour on Monday evening.

Deputy EO Sri Natesh Babu, Manuscripts Special Officer Smt Vijayalakshmi and others were present.

Cultural events: The devotional cultural programmes organised by the TTD on the occasion, allured the devotees.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హనుమంత వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల విహారం
 
ఒంటిమిట్ట, 2023 ఏప్రిల్ 03: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం రాత్రి విశేషమైన హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. శ్రీ సీతారామలక్ష్మణులు ప్రియభక్తుడైన హనుమంత వాహనాన్ని అధిరోహించి పురవీధుల్లో భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు. రాత్రి 7 గంటల నుండి కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి దర్శించుకున్నారు.
 
త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వారు హనుమంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం ద్వారా తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నారు. దాసభక్తికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతున్నారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబు, మాన్యుస్క్రిప్ట్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీమతి విజయలక్ష్మి, ఏఈఓ శ్రీ గోపాలరావు, సూపరింటెండెంట్లు శ్రీ పి.వెంకటేశయ్య, శ్రీ ఆర్సీ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయ తదితరులు పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.