HE GOVERNOR OF AP & TELANGANA OFFERED PRAYERS TO GODDESS PADMAVATHI_ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌

Tiruchanur, 4 December 2018: HE Governor of Andhra Pradesh and Telangana Sri ESL Narasimhanan accompanied by wife Smt. Vimala Narasimhanan had darshan of Goddess Padmavathi in Sri Padmavathi Ammavari Temple, Tiruchanur on Tuesday evening. On his arrival at temple TTD Joint Executive Officer Sri Pola Bhaskar and temple priests welcomed him with temple honors. After darshan of the Goddess TTD JEO presented Ammavari Prasadam.

Dist Collector Sri Prudhyama, DyEO Smt Jhansi Rani, Temple priets and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌

తిరుప‌తి, 2018 డిసెంబ‌రు 04: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని మంగ‌ళ‌వారం సాయంత్రం తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌ దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| గవర్నర్‌కు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, అర్చక బృందం కలిసి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందించారు.

ఈ సందర్భంగా గౌ|| గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, అంద‌రికీ ఆరోగ్యం, సంప‌ద ప్ర‌సాదించాల‌ని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో క‌లెక్ట‌ర్ శ్రీ పిఎస్‌.ప్ర‌ద్యుమ్న‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.