CHINMAYI TAKES RIDE ON CHINNA SESHA_ చిన్నశేష వాహనంపై పరమపదనాథుని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి అభయం
Tiruchanoor, 4 December 2018: In all Her divine resplendent, Sri Padmavathi Devi took celestial ride on five hooded serpent vahanam.
In the serpentine kingdom, King Vasuki is considered as Chinna Sesha Vahanam while mighty serpent king Adi sesha as Pedda Sesha Vahanam.
The privilege of carrying the deity twice is given to serpent king only in the form of Chinna Sesha on first day and Pedda Sesha on second day morning.
Tirupati JEO Sri Pola Bhaskar, Addl CVSO Sri Sivakumar Reddy, DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, temple staff and devotees took part.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
చిన్నశేష వాహనంపై పరమపదనాథుని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి అభయం
తిరుపతి, 2018 డిసెంబరు 04: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటిరోజు రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు పరమపదనాథుని అలంకారంలో చిన్నశేషవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. రాత్రి 8 నుండి 11 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారిని దర్శించిన భక్తులకు యోగసిద్ధి చేకూరుతుంది.
వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్, టిటిడి జెఈవో శ్రీ పోల భాస్కర్, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.