HILL SHRINE SHINES UNDER THE GLOW OF GHEE LIT LAMPS _ శ్రీవారి ఆలయంలో కన్నుల పండుగగా కార్తీక దీపోత్సవం

KARTHIKA PARVA DEEPOTSAVAM HELD AT TIRUMALA SRIVARI TEMPLE

Tirumala, 15 December 2024: The beauty of Tirumala temple enhanced in the vibrant glow of ghee-lit lamps on the auspicious occasion of the Salakatla Karthika Parva Deepotsavam held on Sunday evening.

It is an age-old tradition to observe Kartika Deepotsavam on the full moon day of Kartikai at the Tirumala Srivari Temple every year.

Following this festival TTD has cancelled the Sahasra Deepalankara Seva as well the Pournami Garuda Seva.

As part of this Kartika Parva Deepotsavam held from 6pm to 8 pm, initially the broken mud pots, Mookullu filled ghee wicks were lit behind Sri Yoga Narasimha Swamy temple and later taken inside Garbhalayam and offered prayers in front of Srivaru.

After that, the vimana pradakshina is performed as a procession and aarti is offered to Jaya Vijaya, Garuda, Potu Tayar, Ananda Nilayam, Varadaraja Swamy and all the important places within the temple complex. 

Outside the temple the traditional ghee lamps were lit at Sri Bedi Anjaneya Swamy, Sri Varaha Swamy Temple and Swami Pushkarini.

On the whole around 80 Mookullu, over 1000 Pramidalu were lit in the entire temple premises. Devotees also cherished the festival of lights chanting Govinda… Govinda with religious ecstasy.

HH Tirumala Pedda Jeeyar Swamy, TTD Board member Sri Bhanuprakash Reddy, JEO Sri Veerabrahmam, SP Sri Subbarayudu, DyEO Sri Lokanatham, Peishkar Sri Rama Krishna, VGO Sri Surendra and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో కన్నుల పండుగగా కార్తీక దీపోత్సవం

తిరుమల, 2024 డిసెంబరు 15: తిరుమల శ్రీవారి అలయంలో ఆదివారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది.

ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళంఅర దగ్గర 80 కొత్త మూకుళ్లతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు. ఆతర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారు బావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజ స్తంభం, బలిపీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూల బావి, రంగ నాయక మండపం, మహా ద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా వెయ్యి నేతి జ్యోతులను మంగళ వాయిద్యల న‌డుమ‌ వేద మంత్రోచ్ఛారణలతో ఏర్పాటు చేశారు.

కార్తీక దీపోత్సవం కారణంగా టీటీడీ పౌర్ణమి గరుడ సేవను రద్దు చేసింది.

ఈ కార్తీకదీపోత్సవంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, డిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ రామకృష్ణ, వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయంలో కార్తీకదీపోత్సవ శోభను తిలకించి భక్తులు తన్మయత్వంతో పులకించారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.