HINDU DHARMA PRACHARAM ACROSS THE NATION IN A BIG WAY AND TRANSPARENT ADMINISTRATION ARE OUR PRIME MOTTOS-TTD CHAIRMAN _ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం, పారదర్శక పాలన – యాగంటి కార్తీక మహా దీపోత్సవంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

ONLY TRUST BOARD TO PUBLISH WHITE PAPER ON TTD ASSETS AND BANK DEPOSITS IN TTD’s HISTORY

YAGANTI SHINES BRIGHT IN THE RAYS OF WITH MILLIONS OF GHEE LIT LAMPS

SCORES OF DEVOTEES TAKES PART IN DEEPOTSAVAM

TIRUPATI, 07 NOVEMBER 2022:Under the instructions of the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy, TTD has taken up the Hindu Dharma Prachara in a big way with various dharmic, spiritual programmes across the country and offering a transparent administration, said TTD Trust Board Chairman Sri YV Subba Reddy.

Speaking on the auspicious occasion of Karthika Deepotsavam held at Yaganti Divya Kshetram in Nandyala District on Monday evening, the TTD Board Chief credited that the present Trust Board made a history by releasing white paper on the assets, gold, immovable properties and bank balances of TTD in a transparent manner. 

The Chairman said, TTD has made it clear that every penny offered by the devotees in Srivari Hundi will be deposited in various  made by Banks and TTD has released a white paper on immovable properties a few months ago in a transparent manner and total deposits and gold in banks a couple of days ago for the information of devotee. 

He said, the white paper included that TTD invested Rs.15, 938 crores and 10, 258 kilos of Gold deposits in various banks. This was for the first time to declare the details about TTD in public since its inception in 1933, he added.

The TTD Chairman briefed the series of Dharmic activities taken up by TTD in the recent times as a part of Santana Hindu Dharma Prachara, including Gudiko Gomata, Gopuja, construction of temples in Metros, Cities etc. Another 1500 temples are underway in the backward areas which will be completed in next couple of years”, he added.

Explaining the significance about Karthika Maha Deepotsavam, the Chairman said, by lighting millions of ghee lamps the entire human life with remain strong, healthy, thereby making the nation to achieve overall progress, which was clearly stated in Hindu scriptures, he maintained. So TTD has been organizing Deepotsavams in various places including in Visakhapatnam on November 14 and on November 18 in Tirupati.

The entire pilgrim centre has donned a new look on Monday evening under the illumination emanated by the ghee lit lamps by tens of thousands of devotees who took part in the mega light festival with utmost enthusiasm. 

The devotional dance ballet by students of TTD’s SV College of Music and Dance, sankeertans by Annamacharya Project artists, commentary by Vedic Pundit Dr Ramanujacharulu stood as a special attraction for the entire event. 

The devotees chanted Deepa Mantram and Lakshmi Astottaram, Vishnu Sahasra Nama Parayanam in chorus with the archakas and performed Deepotsavam as per the instructions of the pundits.

MP Sri Brahmananda Reddy, Legislators Sri Rambhupal Reddy, Sri Rami Reddy, TTD EO Sri AV Dharma Reddy, ZP Chief Sri Papi Reddy, Board member Sri Maruti Prasad, JEO (E&H) Smt Sada Bhargavi, one of the chief priests of Tirumala temple Sri Venugopala Deekshitulu and other staffs were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం, పారదర్శక పాలన

– టీటీడీ చరిత్రలో ఆస్తులు, నగదు, బంగారు డిపాజిట్లపై శ్వేత పత్రం ప్రకటించిన బోర్డుమాదే

– యాగంటి కార్తీక మహా దీపోత్సవంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుపతి, 7 నవంబరు 2022: ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగేళ్లుగా టీటీడీ ఒక వైపు పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరోవైపు అత్యంత పారదర్శక పాలన అందిస్తోందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. నంద్యాల జిల్లా యాగంటి పుణ్య క్షేత్రంలో సోమవారం రాత్రి టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. వేలాదిమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని సామూహిక దీపారాధన చేశారు. ఈ సందర్భంగా శ్రీ సుబ్బారెడ్డి భక్తులనుద్దేశించి మాట్లాడారు. పారదర్శక పాలనలో భాగంగా రెండు నెలల కిందట టీటీడీ ఆస్తులకు సంబంధించిన శ్వేత పత్రం విడుదల చేశామన్నారు. రెండు రోజుల క్రితం స్వామివారికి వివిధ బ్యాంకుల్లో ఉన్న 15, 938 కోట్ల నగదు, 10, 258 కిలోల బంగారం డిపాజిట్లకు సంబంధించిన శ్వేత పత్రం విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. 1933 లో టీటీడీ ఏర్పడిన నాటి నుంచి ఏ ప్రభుత్వం, టీటీడీ బోర్డు ఇలా శ్వేత పత్రం విడుదల చేయలేదని ఆయన చెప్పారు.

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా, దేశంలో భ‌క్తులు ఏ ఆల‌యానికి వెళ్లినా గోపూజ చేసుకునే ఏర్పాటు చేశామని వివరించారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో హిందూ ధర్మ ప్రచారాన్ని దేశ వ్యాప్తంగా విస్తరించడం కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ముఖ్యమైన నగరాల్లో స్వామివారి ఆలయాలను నిర్మిస్తున్నామన్నారు. వచ్చే సంవత్సరంలో ముంబై , గాంధీనగర్ లో స్వామి వారి ఆలయాల నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.అలాగే ఎస్సీ, ఎస్టీ, బిసి, మత్స్య కార గ్రామాల్లో తమ ప్రభుత్వ హయాంలో 550 ఆలయాలు నిర్మించామన్నారు.రాబోయే ఏడాదిన్నరలో తెలుగు రాష్ట్రాల్లో మరో 1500 ఆలయాలు నిర్మిస్తామని చైర్మన్ చెప్పారు.

కార్తీక మహా దీపోత్సవం ద్వారా ప్రజలకు ఆయురారోగ్యాలు లభించి, దేశం సుభిక్షంగా ఉంటుందని అనేక పురాణాలు చెప్పాయని ఆయన వివరించారు. అందుకే టీటీడీ ప్రతి ఏడాది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సామూహిక కార్తీక దీపోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోందన్నారు.

ఇందులో భాగంగా సోమవారం యాగంటి లోను , ఈ నెల 14వ తేదీ విశాఖపట్నం , 18వ తేదీ తిరుపతి లో కార్తీక దీపోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్తీక మహా దీపోత్సవంలో పాల్గొన్న, ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసి తరించిన భక్తులందరికీ శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ ఉమామహేశ్వర స్వామి అజ్ఞానం పారదోలి జ్ఞానం ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు. శాసన సభ్యులు శ్రీ కాటసాని రాం భూపాల్ రెడ్డి, శ్రీ కాటసాని రామిరెడ్డి కృషితో యాగంటిలో పెద్ద ఎత్తున కార్తీక దీపోత్సవం నిర్వహించడం మనందరి అదృష్టమని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు.

కార్తీక దీపోత్సవం ఇలా…

నంద్యాల జిల్లా యాగంటి క్షేత్రంలో సోమవారం సాయంత్రం కార్తీక దీపోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ముందుగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వేదపండితులు యతి వందనం చేశారు. పండితులు డా. కోగంటి రామానుజాచార్యులు స్వాగతం, సందర్భ పరిచయం చేశారు. వేదస్వస్తి అనంతరం డా. రామానుజాచార్యులు దీప ప్రాశస్యాన్ని తెలియజేశారు.

అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా శ్రీవారి తిరువారాధన నిర్వహించారు. పండితులు విష్ణుసహస్రనామం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రాలు పారాయణం చేశారు. ఆ తర్వాత అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి పూజ చేపట్టారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆకట్టుకునేలా నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. దీప మంత్రం 9 సార్లు భక్తులతో పలికిస్తూ సామూహిక లక్ష్మీ నీరాజనం సమర్పించారు. చివరగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు పాడుతుండగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు.
చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులతో పాటు, శాసన సభ్యులు శ్రీ కాటసాని రాం భూపాల్ రెడ్డి దంపతులు, శ్రీ కాటసాని రామిరెడ్డి దంపతులు , ఎంపి శ్రీ బ్రహ్మానందరెడ్డి దంపతులు, టీటీడీ ఈవో శ్రీ ధర్మారెడ్డి దంపతులు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ పాపిరెడ్డి , టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ మారుతి ప్రసాద్ , జేఈవో శ్రీమతి సదా భార్గవి, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, అర్చక బృందం , వేద పండితులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.