HOUSE SITES TO REMAINING EMPLOYEES IN 45DAYS-CM_ 45 రోజుల్లో టీటీడీ ఉద్యోగులలందరికీ ఇళ్ల‌స్థలాలు 

AP CM INAUGURATES SRINIVASA SETU IN THE PILGRIM CITY 

OPENS THE TWIN HOSTEL BLOCKS IN SV ARTS COLLEGE

ISSUES HOUSE SITE PATTAS TO 3518 TTD EMPLOYEES

HOUSE SITES TO REMAINING EMPLOYEES IN 45DAYS-CM

DECADES OLD DREAM CAME TRUE FOR TTD EMPLOYEES-TTD CHAIRMAN

TTD EMPLOYEES THANKS THE CM FOR THE HISTORICAL GESTURE

TIRUPATI, 18 SEPTEMBER 2023: Terming it as a historical moment the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy on Monday inaugurated Srinivasa Setu, the elevated Expressway, which was built in a record time under the Smart City Project.

Speaking on the occasion at the inauguration site near Mango Market Yard, the CM said the 7 km Expressway costing ₹650.5 crore is a Jewel for the Temple City. He said the Expressway is an engineering marvel which will reduce the traffic woes of denizens as well visiting pilgrims.

HOSTEL BLOCKS INAUGURATED

Later he inaugurated the new twin hostel blocks built by TTD at a cost of ₹37.80 crore with an aim to provide better facilities to students of Sri Venkateswara Arts College in Tirupati on Monday.The hostel comprises of 181 rooms that accommodates 750 students. 

TTD EMPLOYEES HOUSE SITE PATTAS DISTRIBUTION

Speaking about the house sites the CM said that it is a momentous occasion in the glorious history of TTD where the AP Government has allocated 300 acres land near Padiredu village of Vadamalapeta mandal towards house sites for 3518 TTD employees out of 6700 odd which has been pending since several years.

He also assured the remaining employees will also be allotted house sites in a span of 30-45days amidst huge round of applause from TTD employees. Later he has distributed house site pattas to a few employees.

Earlier Tirupati Legislator and  TTD Board Chief Sri Bhumana Karunakara Reddy said it was during Sri Jaganmohan Reddy’s father and former CM of AP, late Dr YS Rajasekhara Reddy’s regime the house sites were granted and allocated during his Son’s regime. He is fortunate to have worked under the regime of both father and the son as MLA as well TTD Trust Board Chairman. He thanked the CM for making the decades old dream of TTD workforce to become a reality.

At the beginning of the meeting, a short and impressive AV was displayed on all the three events.

Deputy CM Sri Narayana Swamy, Ministers Sri Peddireddi Ramachandra Reddy, Sri Adimulam Suresh, Smt Roja, TUDA Chairman and TTD Ex-officio Sri Mohit Reddy, Mayor Smt Sirisha, Deputy Mayor Sri Abhinay Reddy were present.

Among top brass officials Collector Sri Venkataramana Reddy, SP Sri Parameshwar Reddy, TMC Commissioner Smt Harita, TTD JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CE Sri Nageswara Rao and other officials from district and TTD were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

45 రోజుల్లో టీటీడీ ఉద్యోగులలందరికీ ఇళ్ల‌స్థలాలు

3,518 మంది టీటీడీ ఉద్యోగులకు ఇంటిస్థ‌లాల పంపిణీ

శ్రీనివాస సేతు, ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో హాస్టల్ బ్లాక్‌ల ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి

– టీటీడీ ఉద్యోగుల దశాబ్దాల నాటి కల నెరవేరింది : టీటీడీ ఛైర్మన్

– చారిత్రాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్న ముఖ్యమంత్రివ‌ర్యుల‌కు కృతజ్ఞతలు తెలిపిన టీటీడీ ఉద్యోగులు

తిరుప‌తి, 2023 సెప్టెంబ‌రు 18: తిరుప‌తి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద తిరుప‌తిలో రికార్డు సమయంలో నిర్మించిన శ్రీనివాససేతు ఫ్లైఓవ‌ర్‌ను సోమవారం రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైఎస్‌.జ‌గన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా తిరుప‌తిలోని మామిడికాయ‌ల మండీ వ‌ద్ద జ‌రిగిన శ్రీ‌నివాస సేతు ప్రారంభోత్సవంలో ముఖ్య‌మంత్రివ‌ర్యులు మాట్లాడుతూ రూ.650.50 కోట్లతో 7 కిలోమీటర్ల మేర నిర్మించిన ఫ్లై ఓవ‌ర్ తిరుప‌తి ఆధ్యాత్మిక న‌గ‌రానికి ఆభరణం లాంటిద‌న్నారు. ఇది ఇంజినీరింగ్ అద్భుతమని, దీని వల్ల ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని, యాత్రికులు సుల‌భంగా తిరుమ‌ల‌కు చేరుకోగ‌ల‌గుతార‌ని చెప్పారు.

హాస్టల్ బ్లాక్‌ల ప్రారంభం

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో 37.80 కోట్ల రూపాయలతో టీటీడీ నిర్మించిన రెండు హాస్టల్ బ్లాకులను సోమవారం ముఖ్య‌మంత్రివ‌ర్యులు వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. హాస్టల్ బ్లాకుల్లో మొత్తం 181 గదులు ఉన్నాయి. ఇందులో 750 మంది విద్యార్థులు బస చేయ‌వ‌చ్చు.

టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థ‌లాల పంపిణీ

టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థ‌లాల పంపిణీ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రివ‌ర్యులు మాట్లాడుతూ వడమాలపేట మండలం పాదిరేడు గ్రామ సమీపంలో రాష్ట్ర‌ ప్రభుత్వం 300 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం టీటీడీ చరిత్రలో ఒక మహత్తర ఘట్టమన్నారు. మొత్తం 6700 మంది టీటీడీ ఉద్యోగులు ఉండ‌గా ప్ర‌స్తుతం రూ.313 కోట్ల వ్య‌యంతో 3,518 మందికి ఇంటిస్థ‌ల ప‌ట్టాలు పంపిణీ చేస్తున్నామ‌ని, రూ.280 కోట్ల వ్య‌యంతో మిగిలిన ఉద్యోగులకు కూడా 30 నుండి 45 రోజుల వ్యవధిలో ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని ముఖ్య‌మంత్రివ‌ర్యులు హామీ ఇచ్చారు. అనంతరం కొంతమంది ఉద్యోగులకు ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు.

అంత‌కుముందు తిరుపతి శాసనసభ్యులు, టీటీడీ ఛైర్మ‌న్‌ శ్రీ భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్య‌మంత్రి డాక్టర్ వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో గ‌తంలో టీటీడీ ఉద్యోగుల‌కు ఇళ్ల‌స్థ‌లాలు మంజూర‌య్యాయ‌ని, తిరిగి వారి కుమారుడు ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి హయాంలోనే ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయని తెలిపారు. తండ్రీ కొడుకుల హయాంలో టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా పని చేయడం త‌న అదృష్టమన్నారు. టీటీడీ ఉద్యోగుల దశాబ్దాల కలను సాకారం చేసినందుకు ముఖ్య‌మంత్రివ‌ర్యుల‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సమావేశం ప్రారంభంలో ఈ మూడు కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి ఆడియో విజువ‌ల్‌ను ప్రదర్శించారు.

గంగమ్మను ద‌ర్శించుకున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు

ప్రాచీన సంప్రదాయాన్ని పాటిస్తూ ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమలకు బయలుదేరే ముందు తిరుప‌తిలోని తాతయ్యగుంట గంగమ్మను ద‌ర్శించుకుని పూజలు నిర్వ‌హించారు.

గంగమ్మను శ్రీవేంకటేశ్వరుని సోదరిగా పురాణాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర సందర్భంగా తిరుమ‌ల శ్రీ‌వారు సంప్రదాయంగా సారె పంపుతారు.

స్థానిక ఎమ్మెల్యే, టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి కృషితో ముఖ్యమంత్రి తిరుమల చేరుకునే ముందు గంగ‌మ్మ‌ను ద‌ర్శించుకునే సంప్రదాయం చాలా దశాబ్దాల తరువాత గత సంవత్సరం నుండి పునఃప్రారంభ‌మైంది.

డెప్యూటీ సీఎం శ్రీ నారాయణ స్వామి, మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ ఆదిమూలం సురేష్, శ్రీమతి రోజా, తుడా ఛైర్మన్‌, టీటీడీ బోర్డు స‌భ్యులు శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మేయర్ డాక్ట‌ర్ శిరీష, డెప్యూటీ మేయర్ శ్రీ భూమ‌న అభినయ్ రెడ్డి పాల్గొన్నారు.

ఉన్నతాధికారుల్లో కలెక్టర్ శ్రీ వెంకటరమణారెడ్డి, ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డి, తిరుప‌తి మున్సిప‌ల్ కమిషనర్ శ్రీమతి హరిత, టీటీడీ జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఛీప్ ఇంజినీర్‌ శ్రీ నాగేశ్వరరావు, జిల్లా, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.