DHWAJAROHANAM MARKS BEGINNING OF THE BIG RELIGIOUS FETE _ ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

TIRUMALA, 18 SEPTEMBER 2023: The annual Brahmotsavams of Srivaru commenced on a grand religious note on Monday evening between 6.15 pm and 6.30 pm with the celestial Garuda flag hoisting ceremony in the auspicious Meena Lagnam.

In the presence of Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi, the Archakas hoisted the flag on the golden flagpole amidst the Mangalavadyams and Vedic hymns. 

Sri Ramakrishna Dixitulu acted as the Kankanabhattar for the event..

This religious event signifies inviting all the deities and Ashtadikpalakas to the annual Brahmotsavams.

TTD EO Sri. AV Dharma Reddy, Temple Deputy EO Sri. Lokanatham, Peishkar Sri. Srihari and others participated in this program.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు – 2023

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుమల, 2023 సెప్టెంబ‌రు 18: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు సోమ‌వారం సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. శ్రీ రామ‌కృష్ణ దీక్షితులు కంక‌ణ‌భ‌ట్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.

ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.