I-DAY FETE AT GOKULAM_ జెండా పండుగకు తిరుమల ముస్తాబు

Tirumala, 13 August 2017: The Independence Day will be observed at Gokulam Rest House on August 15 in Tirumala.

The JEO Tirumala Sri KS Sreenivasa Raju will hoist the National Flag and deliver the I-Day message by 7am on Tuesday.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జెండా పండుగకు తిరుమల ముస్తాబు

తిరుమల, 13 ఆగస్టు 2017 : ఈనెల 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురష్కరించుకుని తిరుమల జెండాపండుగకు సర్వసన్నద్ధమైనది. గోకులం అతిథిభవనం ప్రాంగణంలో జెండా పండుగను నిర్వహించేందుకు వీలుగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉ.7.00 గంటలకు జాతీయ జెండాను తిరుమల జెఇఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు వినీలాకాశంలో ఎగురవేసి గౌరవ వందనం చేయనున్నారు. అనంతరం సిబ్బందిని ఉద్ద్యేశించి స్వాతంత్య్ర దినోత్సవ సందేశాన్ని అందించనున్నారు.

ఈ వేడుకలో తిరుమలలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.