PILGRIMS SWARM TIRUMALA_ తిరుమలకు పోటెత్తిన భక్తులు-నిరంతరాయంగా తి.తి.దే అన్నప్రసాద సేవలు

Tirumala, 13 August 2017: With the week ends coupled with holidays, Tirumala has been witnessing unprecedented pilgrim rush since Saturday and is expected to continue till Tuesday.

On Sunday, every inch of Tirumala has been occupied by pilgrims. Both the Alipiri and Srivarimettu footpath routes are abuzz with pilgrim activity. Serpentine queue lines stretched at Narayanagiri Gardens.

Under the instructions of TTD EO Sri Anil Kumar Singhal, TTD has made elaborate arrangements of annaprasadam in queue lines, inside compartments, in food courts and also opposite Gokulam rest house besides Annaprasadam complex for the sake of thronging pilgrims.

The Annaprasadam DyEO Sri Venugopal, Catering Officer Sri Sastry, Health officer Dr Sermista continuously monitored the queue lines at Naryanagiri Gardens and supplied food and water at regular intervals to the pilgrims.

The TTD security along with Srivari sevakulu and scouts offer best possible services to pilgrims to avoid any untoward incident with the instructions of TTD CVSO Sri A Ravikrishna.

On the other hand, VGOs Sri Ravindra Reddy, Smt Sadalakshmi along with AVSOs personally supervised the movement of pilgrims at VQC and inside temple.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమలకు పోటెత్తిన భక్తులు-నిరంతరాయంగా తి.తి.దే అన్నప్రసాద సేవలు

తిరుమల, 13 ఆగస్టు 2017 : వారాంతపు సెలవులకు పండుగ సెలవులు తోడవడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. రెండవ శనివారం, ఆదివారంతో పాటు గోకులాష్టమి, పంద్రాగస్టు సెలవులు కలసి రావడంతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు అసంఖ్యాకంగా భక్తులు తరలివచ్చారు. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, లడ్డూ కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలలో క్యూలైన్లు దాటి భక్తుల రద్దీ అనూహ్యంగా కనబడింది.

తి.తి.దే ఈ.ఓ శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు సీనియర్‌ అధికారులు గత రెండు రోజులుగా తిరుమలలో ఉంటూ భక్తులకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా అన్నప్రసాదం డిప్యూటి.ఇ.ఓ శ్రీ వేణుగోపాల్‌, క్యాటరింగ్‌ అధికారి, జి.ఎల్‌.ఎన్‌ శాస్త్రి పర్యవేక్షణలో వైకుంఠం కంపార్ట్‌మెంట్లు, పుడ్‌కోర్టులు, గోకులం అతిధి భవనం వద్ద, భక్తజనసందోహం వున్న పలు ప్రాంతాలలో వివిధ క్యూలైన్లలో వేచివున్న భక్తులకు క్రమం తప్పకుండా అన్నప్రసాదాలను, త్రాగునీటి సదుపాన్ని నిరంతరాయంగా అందిస్తున్నారు. ఈ సేవలలో తి.తి.దే సిబ్బందితో పాటు సుమారు 1600 మంది శ్రీవారి సేవకులు కూడా రాత్రింబగళ్ళు నిరంతరాయంగా సేవలందిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆరోగ్యశాఖాధికారిణి శ్రీమతి షర్మిష్ట తిరుమల పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

మరో ప్రక్క తి.తి.దే ముఖ్యనిఘా మరియు భత్రాధికారి శ్రీ ఆకే. రామకృష్ట నేతృత్వంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ప్రాంతాలలో వి.జి.ఓ శ్రీ రవీద్రారెడ్డి, ఆలయం చెంత వి.జి.ఓ శ్రీమతి సదాలక్ష్మి పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా క్యూలైన్లలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

శనివారం నుండి మొదలైన ఈ భక్తుల రద్దీ మంగళవారం వరకు కొనసాగనుంది. కాగా శనివారంనాడు 93,290 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకన్నారు. 57,214మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.