ఆగస్టు 14న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ”మనగుడి” ఘనంగా ఆలయాలలో నగర సంకీర్తన

ఆగస్టు 14న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ”మనగుడి” ఘనంగా ఆలయాలలో నగర సంకీర్తన

తిరుపతి, 2017 ఆగస్టు 13: టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఆగస్టు 14వ తేదీ సోమవారం గోకులాష్టమి పర్వాదినాన్ని పురస్కరించుకుని 1,250 మండలాల్లో ఎంపిక చేసిన ఆలయాల్లో టిటిడి ”మనగుడి” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నది. ఇందులో భాగంగా రెండవ రోజైన ఆదివారం ఆయా ఆలయాలలో నగర సంకీర్తన ఘనంగా నిర్వహించారు.

మనగుడి కార్యక్రమంలో భాగంగా ఆదివారం తిరుపతిలోని రాయల చెరువు రోడ్డులోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో నగర సంకీర్తన కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళాలు సాంప్రదాయ వస్త్రధారణలో ఉత్సహంగా పాల్గొన్నారు.

ఆలయ ప్రాశస్త్యాన్ని, ఆలయ ధర్మాలను తెలియజేసి ధర్మబద్ధంగా భక్తులందరినీ ఏకం చేసేది మనగుడి. మనగుడి కార్యక్రమాన్ని టిటిడి 2012వ సంవత్సరం ప్రారంభించింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.