IIT TEAM INSPECTED GHAT ROADS _ ఘాట్‌ రోడ్లలో కొండచరియలను పరిశీలించిన ఐఐటి నిపుణుల బృందం

Tirumala, 2 December 2021: A three-member IIT experts team from Chennai and Delhi inspected the landslides, rockfall damages on the second Ghat road on Thursday afternoon.

The team comprising of Sri KS Rao, Delhi IIT, Sri Sripad of Chennai IIT along with Sri Ramachandra Reddy, retired TTD CE and adviser were invited by the TTD for their suggestions to avert landslides in future. The TTD engineers accompanied the experts and explained the ground situation to the experts.

Speaking to reporters the IIT expert Sri KS Rao said the Ghat roads were once repaired in 2017 after rain havoc with the latest technology.

He said the critical, spots were cushioned with mesh fencing, rock belting, shot-creating, burst walls etc. and drainage system along the Ghat roads and the Sheshachala forest and hill ranges.

He said the unprecedented rains had brought down rocks of 30-40 tons size on the Ghat roads damaging retainer walls etc. down below. He said there was a likelihood of rockfalls in five to six spots.

He said as of now after repairs to the second Ghat road and Link Road to Mokalamettu all vehicles can reach Tirumala.

He said a detailed report on how to stall rockfalls and landslides will be presented to TTD in three days time.

CE Sri Nageswara Rao and SE Sri Jagdishwar Reddy were present. ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఘాట్‌ రోడ్లలో కొండచరియలను పరిశీలించిన ఐఐటి నిపుణుల బృందం

తిరుమల, 2021 డిసెంబ‌రు 02: ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు ఘాట్‌ రోడ్లలోని కొండచరియలు విరిగిప‌డిన విష‌యం విధిత‌మే. ఈ నేపథ్యంలో అలిపిరి, రెండ‌వ‌ ఘాట్ రోడ్‌లో కొండచరియలను ఢిల్లీ ఐఐటి నిపుణులు శ్రీ కె.ఎస్‌.రావు, చెన్నై ఐఐటి నిపుణులు శ్రీ ప్ర‌సాద్‌, టిటిడి పూర్వ‌పు చీఫ్ ఇంజినీర్ మ‌రియు సాంకేతిక స‌ల‌హాదారు శ్రీ రామ‌చంద్ర‌రెడ్డి బృందం గురువారం మ‌ధ్యాహ్నం పరిశీలించింది.

కొండచరియలు విరిగిపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనల కోసం ఐఐటి నిపుణులను టిటిడి ఆహ్వానించింది. ఈ సందర్భంగా టిటిడి ఇంజినీరింగ్ అధికారులు వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న రోడ్లు, గోడ‌లు, క‌ల్వ‌ర్టు త‌దిత‌ర ప్రాంతాల‌ను ఐఐటి నిపుణులకు చూపించి వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఐఐటి నిపుణులు శ్రీ కె.ఎస్‌.రావు మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో దేశంలోని వివిధ కొండ ప్రాంతాల్లో ఘాట్ రోడ్ల‌లో వ‌ర్షాల‌కు కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలిపారు. 2017 వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న తిరుమ‌ల ఘాట్ రోడ్ల‌లో మ‌ర‌మ్మ‌త్తుల‌కు ఈ టెక్నాల‌జీ ఉప‌యోగించిట్లు చెప్పారు. ఇప్ప‌టికే టిటిడి ఇంజినీరింగ్ విభాగం ఘాట్ రోడ్ల‌కు ఇరువైపులా సున్నిత‌మైన ప్రాంతాల‌ను గుర్తించి బండ‌రాళ్ళ‌కు ఫెన్సీంగ్, రాక్ బోల్టింగ్‌, షాట్ క్రీటింగ్‌, బ్ర‌స్ట్ వాల్స్‌ ఏర్పాటు చేసింద‌న్నారు. శేషాచ‌ల కొండ‌ల్లో, ఘాట్ రోడ్ల‌లో వర్ష‌పు నీరు నిలువకుండా వెళ్ళ‌డానికి అద‌న‌పు కాలువ‌లు ఏర్పాటు చేయాల‌న్నారు.

ప్ర‌స్తుత వ‌ర్షాల‌కు విరిగిప‌డిన బండ‌రాళ్ళు 30 నుండి 40 ట‌న్నులు ఉంటాయ‌ని, ఇవి చాలా ఎత్తు నుండి ప‌డ‌టం వ‌ల‌న రోడ్లు, ర‌క్ష‌ణ గోడ‌లు దెబ్బ‌తిన్నాయ‌న్నారు. అప్ ఘాట్ రోడ్డులో మరో ఐదారు చోట్ల కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉంద‌ని గుర్తించామ‌న్నారు. ప్ర‌స్తుతానికి రెండ‌వ ఘాట్ రోడ్డులో అక్క‌డ‌క్క‌డ మ‌ర‌మ్మ‌త్తులు చేసి లింక్ రోడ్డు ద్వారా మోకాళ్ళ‌ మెట్టు చేరుకుని అక్క‌డి నుండి తిరుమ‌లకు చేరుకోవ‌చ్చ‌న్నారు. కొండచరియలు విరిగిపడకుండా ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలనే విషయంపై పూర్తి స్థాయిలో అధ్య‌యనం చేసి రెండు, మూడు రోజుల్లో టిటిడికి స‌మ‌గ్ర నివేదిక అందిచ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.