IMMENSELY FRUITFUL SUNDARAKANDA PARAYANAMS, SAYS BRAHMARASHI CHAGANTI KOTESWARA RAO _ సుంద‌ర‌కాండ పారాయ‌ణం అత్యంత ఫ‌ల‌దాయ‌కం : బ్ర‌హ్మశ్రీ చాగంటి కోటేశ్వ‌ర‌రావు

Tirumala, 24 February 2021: The SVBC live telecast of the ongoing Akhanda 

Sundarakanda parayanams enthusing devotees to follow at their homes has been immensely fruitful, says Brahmarashi Chaganti Koteswar Rao.

Participating in the sundarakanda parayanams at the Nada Niranjanam platform on Wednesday morning he said the divine vibrations of the sundarakanda shlokas at devotees homes has been producing positive energies to defeat the pandemic COVID-19.

He lauded the TTD and TTD additional EO Sri AV Dharma Reddy for their spiritual initiatives during the Covid environment in the country by launching yearlong spiritual activities.

The Brahmarashi said listening and chanting the glory and lores of the life story of Sri Rama was well known as a life sanitizer and life-giver.

Meanwhile, the Maha mantra parayanam mahotsavam launched by TTD for well being of humanity during the Covid lockdown period has on Wednesday crossed the 321 days mark including the sundarakanda parayanams for 259 days.

The parayanams were performed by the Vedic pundits of Dharmagiri Veda vijnan peetham and others and OSD of SV Higher Vedic Studies Institute Dr Akella Vibhishana Sharma narrated the significance and divine meanings of the shlokas.

TTD Additional EO Sri AV Dharma Reddy and several Vedic pundits and officials were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సుంద‌ర‌కాండ పారాయ‌ణం అత్యంత ఫ‌ల‌దాయ‌కం : బ్ర‌హ్మశ్రీ చాగంటి కోటేశ్వ‌ర‌రావు

తిరుమ‌ల‌, 2021 ఫిబ్ర‌వ‌రి 24: టిటిడి చేప‌ట్టిన సుంద‌ర‌కాండ పారాయ‌ణం కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా ప్ర‌తి ఇంట్లో భ‌క్తులు పారాయ‌ణం చేస్తున్నార‌ని, ఇది అత్యంత ఫ‌ల‌దాయ‌క‌మ‌ని ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌న‌క‌ర్త బ్ర‌హ్మ‌శ్రీ చాగంటి కోటేశ్వ‌ర‌రావు ఉద్ఘాటించారు. తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదిక‌పై బుధ‌వారం ఉద‌యం జ‌రిగిన సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో ఆయ‌న పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా బ్ర‌హ్మ‌శ్రీ చాగంటి కోటేశ్వ‌ర‌రావు ఉప‌న్య‌సిస్తూ సుంద‌ర‌కాండ శ్లోకాల శ‌బ్ద త‌రంగాలు ప్ర‌తి ఇంట్లో వ్యాపిస్తున్నాయ‌ని, దీనివ‌ల్ల పాజిటివ్ ఎన‌ర్జీ పెరిగి క‌రోనా వ్యాధి విముక్తికి మార్గం సుగ‌మం అవుతుంద‌ని అన్నారు. యావ‌త్ ప్రపంచానికి ఇంత‌టి గొప్ప కార్య‌క్ర‌మాన్ని అందిస్తున్న టిటిడి యాజ‌మాన్యానికి, అద‌న‌పు ఈవో, ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి ఈ సంద‌ర్భంగా ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. రామ‌క‌థ తెలిసి చెప్పుకున్నా, తెలియ‌క చెప్పుకున్నా గొప్ప అభ్యున్న‌తి క‌లుగుతుంద‌న్నారు. సుంద‌ర‌కాండ‌లో అడుగ‌డుగునా రామ‌చంద్రుని గుణ‌గానం వినిపిస్తుంద‌ని చెప్పారు. రామ‌క‌థ చ‌నిపోయే వారిని కూడా బ‌తికిస్తుంద‌ని వాల్మీకి మ‌హ‌ర్షి తెలియ‌జేశార‌ని వివ‌రించారు. రామ‌కార్యంలో వాన‌రుల‌కు మాట‌సాయం చేసిన సంపాతికి, హ‌నుమంతునికి ఆతిథ్య‌మిచ్చిన మైనాకుడికి ఎంతో మేలు చేకూరింద‌ని చెప్పారు.

లోక క‌ల్యాణార్థం టిటిడి నిర్వ‌హిస్తున్న‌ పారాయణ యజ్ఞంలో భాగంగా మంత్ర పారాయణం ప్రారంభించి నేటికి 321 రోజులు పూర్తి కాగా, సుందరకాండ పారాయ‌ణం 259వ రోజుకు చేరుకుంది. ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం శాస్త్ర పండితులు శ్రీ శేషాచార్యులు సుంద‌ర‌కాండ శ్లోకాల‌ను పారాయ‌ణం చేయ‌గా, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్ర‌త్యేకాధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ అర్థ తాత్ప‌ర్యాన్ని, వైశిష్ట్యాన్ని తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎ.వి. ధర్మారెడ్డి, ప‌లువురు పండితులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.