ACHIEVE GOOD RESULTS IN SSLC WITH TUITIONS TO STUDENTS- TTD JEO (M&E) _ “పది” లో ఉత్తమ ఫలితాలు సాధించాలి – విద్యార్థులకు ట్యూషన్ చెప్పాలి టీటీడీ జెఈవో(విద్య,వైద్యం) శ్రీమతి సదా భార్గవి

Tirupati, 24 February 2021: TTD Joint Executive Officer (Education &Health) Smt Sada Bhargavi has on Wednesday exhorted the teachers of the TTD educational institutions to achieve good results in the SSLC exams by providing tuitions to students.

Speaking after inspection of the Sri Kapileswara Swamy higher secondary school at Tatitopu, the TTD JEO enquired with students and Head Master on whether the students followed the lessons and how much syllabus was completed.

He also directed that the COVID-19 guidelines should be strictly followed in school premises and she also enquired with students on the quality of mid-day meal supplied by the ISKON,

The TTD JEO also inspected the garbage Dump near the Sri PrasannaVenkateshwara Swamy temple at Appalayagunta and directed the officials to ensure the swift removal of garbage to facilitate the pilgrims.

TTD Additional Health officer Dr Sunil and others were present.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

” పది ” లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
– విద్యార్థులకు ట్యూషన్ చెప్పాలి

టీటీడీ జెఈవో(విద్య,వైద్యం) శ్రీమతి సదా భార్గవి

తిరుపతి 24 ఫిబ్రవరి 2021: టీటీడీ విద్యా సంస్థలు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రత్యేకంగా కృషి చేయాలని, విద్యార్థులకు ట్యూషన్ చెప్పాలని టీటీడీ జెఈవో(విద్య, వైద్యం) శ్రీమతి సదా భార్గవి ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.

తిరుపతి రూరల్ మండలం తాటితోపులోని శ్రీ కపిలేశ్వర స్వామి ఉన్నత పాఠశాలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె విద్యార్థులతో మాట్లాడారు. ఉపాద్యాయులు చెబుతున్న పాఠాలు అర్థం అవుతున్నాయా లేదా? అర్థం కాకపోతే మళ్లీ అడుగుతున్నారా లేదా అని విద్యార్థులను ప్రశ్నించారు. పదవ తరగతి పోర్షన్ ఎంతవరకు పూర్తి చేశారని ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు.

పాఠశాలలో కోవిడ్ 19 మార్గదర్శకాలు తప్పని సరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఇస్కాన్ అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, రుచి ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

చెత్త తరలింపు కేంద్రం పరిశీలన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్న చెత్త తరలింపు కేంద్రాన్ని జెఈవో శ్రీమతి సదా భార్గవి బుధవారం తనిఖీ చేశారు. యాత్రికులకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు చెత్త తరలించాలని అధికారులను ఆమె ఆదేశించారు. అన్ని స్థానిక ఆలయాల వద్ద చెత్త తరలింపునకు సంబంధించిన సమయాలు, వివరాలు తనకు అందించాలని ఆదేశించారు.
అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది