మే 30వ తేది నుండి జూన్‌ 7వ తేది వరకు శ్రీగోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

మే 30వ తేది నుండి జూన్‌ 7వ తేది వరకు శ్రీగోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, మే-27, 2009: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 30వ తేది నుండి జూన్‌ 7వ తేది వరకు తొమ్మిది రోజుల పాటు కన్నుల పండుగగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా మే 30వ తేదిన ఉదయం 8.37నిమిషాలకు మిధునలగ్నము నందు ధ్వజారోహణం నిర్వహిస్తారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో రోజువారి వాహనములు ఈ విధంగా ఉన్నాయి. మే 30వ తేదిన సాయంత్రం 8గంటలకు పెద్దశేషవాహనం, 31 వ తేదిన ఉదయం 7గంటలకు చిన్నశేషవాహనం, రాత్రి 8గంటలకు హంసవాహనం, జూన్‌ 1వ తేదిన ఉదయం 7గంటలకు సింహవాహనం, రాత్రి 8గంటలకు ముత్యపుపందిరివాహనం, జూన్‌ 2వ తేదిన ఉదయం 7గంటలకు కల్పవృక్షవాహనం, రాత్రి 8గంటలకు సర్వభూపాలవాహనం, జూన్‌ 3వ తేదిన ఉదయం 6గంటలకు పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం) రాత్రి 8గంటలకు గరుడసేవ, జూన్‌ 4వ తేదిన ఉదయం 7గంటలకు హనుమంతవాహనం, సాయంత్రం 4గంటలకు వసంతోత్సవం, రాత్రి 8 గంటలకు గజవాహనం, జూన్‌ 5వ తేదిన ఉదయం 7గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనం, జూన్‌ 6వ తేదిన ఉదయం 8.10గంటలకు రథోత్సవం, రాత్రి 8గంటలకు అశ్వవాహనం, జూన్‌ 7వ తేదిన ఉదయం 5గంటలకు  పల్లకీ ఉత్సవం, రాత్రి 8గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 9.10గంటలకు ధ్వజావరోహణం నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 6.30గంటలకు ఆలయంలో ఊంజల్‌ సేవ నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.