ALL SET FOR GARUDA SEVA_ గ్యాల‌రీల్లో 2 ల‌క్ష‌ల మంది గ‌రుడ‌సేవ‌ను ద‌ర్శించేలా ఏర్పాట్లు :టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు

Tirumala, 16 September 2018: TTD has geared up to observe the most important festival, Garuda Seva, on Monday evening, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.

During press conference at Media Centre, the JEO said, the capacity of galleries in four mada streets will hold 2lakh devotees.

We have set up separate entry and exit points in North, East, West and South Mada streets. An Executive Engineer level officer had been deployed in each mada Street while one Superintending Engineer to monitor two mada streets each. For overal super vision we have deployed FACAO Sri Balaji in Mada streets and Chief Engineer Sri Chandra Sekhar Reddy in outside lines”, he added.

The JEO also said, the engineering, vigilance, Anna prasadam, Health departments have completely geared up to meet Garuda seva rush.

CVSO Incharge Sri Siva Kumar Reddy, SVBC CEO Sri Nagesh Kumar, PRO Dr T Ravi were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

గ్యాల‌రీల్లో 2 ల‌క్ష‌ల మంది గ‌రుడ‌సేవ‌ను ద‌ర్శించేలా ఏర్పాట్లు :టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు

సెప్టెంబరు 16, తిరుమల 2018: ఈసారి బ్ర‌హ్మోత్స‌వాలకు అద‌నంగా ఈశాన్యం వైపు 8 వేల మంది భ‌క్తులు కూర్చొనేలా గ్యాల‌రీ అందుబాటులోకి వ‌చ్చింద‌ని, గ‌రుడ‌సేవ‌లో మొత్తం 2 ల‌క్ష‌ల మంది గ్యాల‌రీల్లో కూర్చొని స్వామివారిని ద‌ర్శించుకునేలా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ సోమ‌వారం గ‌రుడ‌సేవ నాడు ఉద‌యం 10 గంట‌ల నుండి భ‌క్తుల‌ను గ్యాల‌రీల్లోకి అనుమ‌తిస్తామ‌న్నారు. ఉద‌యం 11 గంట‌ల నుండి సాంబార‌న్నం, పెరుగ‌న్నం, బిసిబెల్లా బాత్‌, సాయంత్రం సుండ‌లు త‌దిత‌ర అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, మ‌జ్జిగ అందిస్తామ‌న్నారు. ప్ర‌తి గ్యాల‌రీలో శ్రీ‌వారి సేవ‌కులు, పారిశుద్ధ్య సిబ్బంది, అన్న‌ప్ర‌సాదం సిబ్బంది ఉంటార‌ని, భ‌క్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేసేందుకు ఒక ఉద్యోగిని అందుబాటులో ఉంచుతామ‌ని తెలిపారు. ఒక్కో మాడ వీధికి ఒక ఇఇ, రెండు మాడ వీధుల‌కు ఒక ఎస్ఇ ఇన్‌చార్జిగా ఉంటార‌ని, మొత్తం నాలుగు మాడ వీధుల‌ను ఎఫ్ఏ,సిఏవో ప‌ర్య‌వేక్షిస్తార‌ని వివ‌రించారు. వాహనసేవలను తిలకించేందుకు మాడ వీధుల్లో 19, భక్తుల రద్దీ ఉన్న ఇతర ప్రాంతాల్లో 12 కలిపి మొత్తం 31 పెద్ద డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

సెప్టెంబ‌రు 16న అర్ధ‌రాత్రి 12 గంట‌ల నుండి సెప్టెంబ‌రు 18న ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల తిరుప‌తి మ‌ధ్య ద్విచ‌క్ర వాహ‌నాల రాక‌పోక‌ల‌ను ర‌ద్దు చేసిన‌ట్టు జెఈవో తెలిపారు. 517 ఆర్‌టిసి బ‌స్సులు 5 వేలకు పైగా ట్రిప్పుల‌తో భ‌క్తుల‌కు ర‌వాణా వ‌స‌తి క‌ల్పిస్తార‌ని చెప్పారు. తిరుమ‌ల‌లోని క‌ల్యాణ‌వేదిక నుండి శిలాతోర‌ణం వ‌రకు రోడ్డుకు ఒక‌వైపున అద‌నంగా 1600 వాహ‌నాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశామ‌న్నారు. తిరుమ‌ల‌లో 7 వేల వాహ‌నాలు మించితే అలిపిరిలో నిలిపివేసి టాటా క్యాన్స‌ర్ ఆసుప‌త్రి, భార‌తీయ విద్యాభ‌వ‌న్ వ‌ద్దగ‌ల‌ పార్కింగ్ ప్ర‌దేశాల‌కు పంపుతామ‌న్నారు. భ‌క్తుల‌కు సంతృప్తిక‌రంగా మూల‌వ‌ర్ల ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు సెప్టెంబ‌రు 16, 17 తేదీల్లో స‌ర్వ‌ద‌ర్శ‌నం, దివ్య‌ద‌ర్శ‌నం టోకెన్లు ఇవ్వ‌డం లేద‌ని, 17న బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను, రూ.300/- టికెట్లు ర‌ద్దు చేశామ‌ని వెల్ల‌డించారు.

మీడియా స‌మావేశంలో టిటిడి ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.