PAVITHROTSAVAM AT SRI PAT FROM SEP 23 TO 25_ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించిన జెఈవో

Tiruchanur, 16 September 2018: Tirupati JEO Sri Pola Bhaskar on Sunday released the posters of the annual pavitrotsavams of Sri Padmavathi Ammavari Temple in his Bungalow in Tirupati. The holy event of Pavitrotsavam will be performed at Sri Padmavati Ammavari Temple, Tiruchanur from September 23-25 and Ankurarpanam for same is being held on September 22

As per Hindu traditions entering temples during mourning periods etc is prohibited and the three day purification event of Pavitrotsavam is performed to ward off impact of such inadvertent happenings in the temple . Temple cleaning and also Punyahavachanam are also performed.

On September 23 Pavitra pratistha and on September 24 Pavitra samarpana and Maha poornahuti will be performed on September 25. Interested devotee couple could participate in the event with a ticket of Rs.750 for which they will get blessings of Goddess along with two laddus and two vadas as prasadam.

Spl Gr DyEO Sri Munirathnam Reddy was also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించిన జెఈవో

సెప్టెంబరు 16, తిరుప‌తి 2018: తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 23 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న వార్షిక పవిత్రోత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను ఆదివారం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆవిష్కరించారు. తిరుపతిలోని జెఈవో బంగ‌ళాలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలిసీ తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సెప్టెంబరు 23వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 24న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 25న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయని వివరించారు. రూ.750/- చెల్లించి గృహస్తులు (ఒకరికి మూడు రోజులపాటు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చని, 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, అర్చ‌కుడు శ్రీ బాబుస్వామి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.