JEO EXALTS SEVAKULU_ శ్రీ‌వారి సేవ‌కులు భ‌క్తిభావంతో సేవ‌లందించాలి : టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tiruchanoor, 4 December 2018: The Srivari Sevakulu should serve the devotees who come for the Karthika Brahmotsavams with utmost devotion and dedication said TTD Tirupati JEO Sri Pola Bhaskar.

Addressing the Srivari Sevakulu at Asthana Mandapam located adjacent to Sri Padmavati temple at Tiruchanoor on Tuesday, he said they should be very patient with devotees during rush hours and particularly when Gaja Vahanam and Panchami Theertham events. He said about 340 sevalu lu including 280 female and 60 male have roped in to render services during annual brahmotsavams, he added.

TTD APRO Kum. P.Neelima appraised that the Srivari Sevakulu had come from all southern states and briefed them on the Dos and Don’ts during the Brahmotsavams. Earlier the Srivari Sevakulu performed bhajans.

DyEOs Smt Jhansi Rani, Smt Gautami, VSO Sri Ashok Goud, Srivari Seva Tirupati Superintendent Smt P Vijayalakshmi and other staffs have also participated in the meeting.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ‌వారి సేవ‌కులు భ‌క్తిభావంతో సేవ‌లందించాలి : టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2018 డిసెంబ‌రు 04: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్స‌వాల‌కు విచ్చేసే భక్తులకు శ్రీ‌వారి సేవ‌కులు భ‌క్తిభావంతో సేవ‌లందించాల‌ని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ కోరారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల ఆస్థానమండపంలో మంగ‌ళ‌వారం శ్రీవారి సేవకులకు అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ శ్రీ‌వారి సేవ‌కులు క్రమశిక్షణ, నిబద్దత, అంకితభావంతో సేవలందించాలన్నారు. సమూహాలుగా ఉన్న భక్తులకు మరింత ఓపికతో సేవలు చేయాలన్నారు. రద్దీ సమయంలో సేవకులు సంయమనం పాటించాలని సూచించారు. ముఖ్యంగా గజవాహనం, పంచమితీర్థం రోజుల్లో నిర్దేశించిన ప్రాంతాల్లో శ్రీవారి సేవకులు మెరుగైన సేవలు అందించాలని కోరారు. 280 మంది మహిళలు, 60 మంది పురుషులు సేవకులుగా వచ్చినట్టు తెలిపారు.

టిటిడి స‌హాయ‌ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల నుంచి శ్రీవారి సేవకులు విచ్చేసినట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సేవకులు చేయాల్సిన, చేయకూడని అంశాలను తెలియజేశారు. ముందుగా శ్రీ‌వారి సేవ‌కులు సుమారు గంట పాటు భజనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, డెప్యూటీ ఈవో (జ‌న‌ర‌ల్‌) శ్రీ‌మ‌తి గౌత‌మి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, శ్రీవారి సేవ తిరుప‌తి సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి పి.విజ‌య‌ల‌క్ష్మి, సిబ్బంది శ్రీ చౌడ నాయ‌క్‌ తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.