EO COMMENCES SOUBHAGYAM IN TIRUCHANOOR_ శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా ”సౌభాగ్యం”

Tiruchanoor, 4 December 2018: The distribution of the sacred materials including vermilion, turmeric, bangles along with Kankanams to women devotees commenced on a grand religious note in Tiruchanoor temple by TTD EO Sri Anil Kumar Singhal on Tuesday evening in Sri Padmavathi Ammavaru temple premises.

Soubhagyam is often described as the good fortune of married women and is observed seeking longevity of their husband’s life.

Started by TTD in 2012, Soubhagyam is observed under the aegis of Hindu Dharma Prachara Parishad wing during every annual brahmotsavams at Tiruchanoor.

Tirupati JEO Sri P Bhaskar, HDPP Secretary Sri Ramana Prasad, DyEOs Smt Goutami, Smt Jhansi Rani and other officials, huge number of women devotees were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా ”సౌభాగ్యం”

తిరుపతి, 2018 డిసెంబ‌రు 04: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా మొద‌టిరోజైన మంగ‌ళ‌వారం సౌభాగ్యం కార్య‌క్ర‌మం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ కలిసి పసుపు, కుంకుమ, గాజులు, కంక‌ణాల‌ను మహిళలకు పంపిణీ చేశారు.

తిరుచానూరులో ప్రకాశిస్తున్న శ్రీ పద్మావతి అమ్మవారు సకల సౌభాగ్యాలను ప్రసాదించే శ్రీమహాలక్ష్మీదేవి. స్వామివారు జగద్భర్త కాగా ఈమె లోకమాత. జగత్తు అంతా వారి కుటుంబమే. లోకంలో సిరిసంపదలు, విద్య, పదవి, జ్ఞానం చివరికి మోక్షం కూడా అమ్మవారి స్వరూపాలే అని శాస్త్రాలే వివరిస్తున్నాయి. జగదేకమాత శ్రీమహాలక్ష్మీ అవతారమైన పద్మావతీ అమ్మవారు అందరికన్నా పెద్ద ముత్తయిదువ. పసుపు, కుంకుమ, కాటుక, గాజులు, కమ్మలను సుమంగళీద్రవ్యాలుగా పెద్దలు చెబుతారు. ఆధునిక స‌మాజంలో ప‌సుపు, కుంకుమ‌ల విలువ‌ను మ‌రిచిపోతున్న యువ‌తుల‌కు వాటి ప్రాధాన్యాన్ని తెలియ‌జేసేందుకు టిటిడి హిందూ ధ‌ర్మప్ర‌చార ప‌రిష‌త్ సౌభాగ్యం కార్య‌క్ర‌మాన్ని రూపొందించింది.

టిటిడి హిందూ ధ‌ర్మప్ర‌చార ప‌రిష‌త్ 2012వ సంవ‌త్స‌రంలో సౌభాగ్యం కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. అప్ప‌టినుండి ప్ర‌తి ఏడాదీ అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు, వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మాన్నినిర్వ‌హిస్తోంది. ఈ బ్ర‌హ్మోత్స‌వాల్లో 50 వేల మంది మ‌హిళ‌ల‌కు ప‌సుపు, కుంకుమ‌, కంక‌ణాలు, 4 గాజులు చొప్పున అందించ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి డా.. ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.