NARASIMHA JAYANTHI OBSERVED IN TIRUMALA_ ఘ‌నంగా న‌ర‌సింహ జ‌యంతి

Tirumala, 4 December 2018: Following the advent of Swathi Nakshatra, Narasimha Jayanthi was observed in Sri Lakshmi Narasimha Swamy temple located in Alipiri footpath route on Tuesday.

Tirumala JEO Sri KS Sreenivasa Raju took part in special abhishekam performed to the presiding by Potu wing of Sri Tirumala temple.

Temple DyEO Sri Harindranath, Peishkar Sri Ramesh Babu and others were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఘ‌నంగా న‌ర‌సింహ జ‌యంతి

తిరుమ‌ల‌, 2018 డిసెంబ‌రు 04: అలిపిరి న‌డ‌క‌మార్గంలోని శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం న‌ర‌సింహ జ‌యంతి ఘ‌నంగా జ‌రిగింది. కార్తీక మాసం, స్వాతి న‌క్ష‌త్రం రోజున ప్ర‌తి ఏడాదీ ఇక్క‌డ న‌ర‌సింహ జ‌యంతిని నిర్వ‌హిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు మాట్లాడుతూ న‌ర‌సింహ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని శ్రీ‌వారి ఆల‌య పోటు విభాగం ఆధ్వ‌ర్యంలో ఇక్క‌డి ఆల‌యంలో స్న‌ప‌న‌తిరుమంజ‌నం వేడుక‌గా నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చంద‌నం త‌దిత‌ర సుగంధ‌ద్ర‌వ్యాల‌తో విశేషంగా అభిషేకం చేశార‌ని చెప్పారు. ఈ పురాత‌న ఆల‌యానికి ఎంతో చారిత్ర‌క ప్రాశ‌స్త్యం ఉంద‌ని, న‌డ‌క‌దారిలో తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తులంద‌రూ ఈ స్వామివారిని ద‌ర్శించుకుంటార‌ని వివ‌రించారు. న‌డ‌కదారి భ‌క్తుల‌కు ఎలాంటి భ‌యం లేకుండా ఇక్క‌డి స్వామివారు అనుగ్ర‌హిస్తున్నార‌ని తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ శ్రీ ర‌మేష్‌బాబు, ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.