JEO LAUDS TTD DEPARTMENTS TOWARDS SUCCESSFUL CONDUCT OF GARUDA SEVA_ గరుడసేవను విజయవంతం చేసిన అధికారులకు, సిబ్బందికి అభినందనలు : జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 18 September 2018: Tirumala JEO Sri KS Sreenivasa Raju on Tuesday complimented the services of all departments during Garuda Seva.

During the officers meeting at Rambhageecha Control Room, the JEO said, Anna prasadam, Water distribution were done effectively by Srivari Sevakulu in the galleries while the scouts manned the pilgrim crowd.

Lauding the services of Anna prasadam and Health departments the JEO said, the departments ensured that the food and water reached every single pilgrim sitting in the galleries.

He also complimented the security arrangements by TTD vigilance in co-ordination with police.

However, the JEO said, if there are any minor flaws, that should be overcome by next Navarathri Brahmotsavams which are scheduled from October 10 to 18.

CVSO Incharge Sri Siva Kumar Reddy and other senior officers were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

గరుడసేవను విజయవంతం చేసిన అధికారులకు, సిబ్బందికి అభినందనలు : జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

తిరుమల, 18 సెప్టెంబరు 2018: ప్రశాంతంగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించి శ్రీవారి గరుడ వాహనసేవ విజయవంతమ‌య్యేందుకు కృషి చేసిన టిటిడి అధికారులు, సిబ్బంది, పోలీసులు, డెప్యుటేషన్‌ సిబ్బందికి టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు అభినందనలు తెలియజేశారు. తిరుమలలోని రాంభగీచా విశ్రాంతి గృహం ఎదురుగా గల కంట్రోల్‌ సెంటర్‌లో మంగ‌ళ‌వారం సాయంత్రం అధికారులతో జెఈవో సమావేశం నిర్వహించారు.

గ్యాలరీల్లోని భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలు, మంచినీరు, మ‌జ్జిగ‌ అందించిన అన్న‌ప్ర‌సాదం, ఆరోగ్య విభాగాల సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌ భక్తులకు విశేషసేవలు అందించారని కొనియాడారు. వాహనసేవను దర్శించుకున్న అనంతరం భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా నిర్దేశిత మార్గాల ద్వారా వెలుపలికి వెళ్లేందుకు టిటిడి ఇంజినీరింగ్‌, భద్రతా సిబ్బంది, పోలీసులు సమన్వయంతో వ్యవహరించారని తెలిపారు. ఈ బ్ర‌హ్మోత్స‌వాల్లో ఎదురైన చిన్న లోటుపాట్ల‌ను కూడా స‌వ‌రించుకుని అక్టోబ‌రు 10 నుండి 18వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో మ‌రింత మెరుగ్గా విధులు నిర్వ‌హించాల‌ని అధికారుల‌కు సూచించారు.

ఈ సమావేశంలో టిటిడి ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఎస్ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.