GAJA VAHANAM SHOWCASES THE GRANDEUR OF LORD_ గజ వాహనంపై శ్రీనివాస ప్రభువు కనువిందు

Tirumala, 18 September 2018: Mounted on the Elephant Vahanam on the evening of the sixth day, Sri Malayappa Swamy took a celestial ride along the four mada streets.

Elephant is often considered to be a symbol elegance, royalty, mightiness and grandeur. Taking a celestial ride on the golden elephant vahanam Lord showcased His royalty to the devotees who thronged to witness the Gaja Vahana Seva.

TTD Chairman Sri P Sudhakar Yadav, EO Sri Anil Kumar Singhal, JEO Sri KS Sreenivasa Raju and others were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

గజ వాహనంపై శ్రీనివాస ప్రభువు కనువిందు

తిరుమల, 2018 సెప్టెంబరు 18: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు మంగళవారం రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు వేంకటాద్రీశుడు గజ వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు.

రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తి ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామి గజవాహనారూఢుడై తిరువీధులలో తిరగడం భక్తులకు మరపురాని దృశ్యం. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజూగాక, ప్రతిరోజూ బ్రహ్మోత్సవాలలో వాహనసేవ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి. బ్రహ్మరథం వెనుక అశ్వాలు, వృషభాలతో ఠీవిగా ఈ గజాలు కూడా నడిచివస్తాయి.

కాగా బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజైన బుధవారం ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 8.00 నుండి 10.00 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు ఊరేగనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.