ముగ్ధ మనోహరం -నయనానందకరం “భరతనాట్యం”


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ముగ్ధ మనోహరం -నయనానందకరం “భరతనాట్యం”

సెప్టెంబరు 18, తిరుప‌తి 2018: వేంకటనాయకుని బ్రహ్మోత్సవాలలో మంగ‌ళ‌వారం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో నేటి సాయంకాలం చెన్నై కి చెందిన శ్రీదేవి నృత్యాలయా వారిచే అభినయించిన “భరత నాట్యం” తిరుపతి నగరవాసులను భక్త సదస్యులను సాక్షాత్ కలియుగవాసుని చెంతకు తీసికొని వెళ్లారు. కార్యక్రమం తొలుత వినాయకునిపై ఆదిశంకర విరచిత ‘గణేశ పంచ‌రత్నం’ తో ప్రారంభమై ‘గోపాలక పాహిమాం’ ‘ఓం నమో నారాయణ’, ‘కృష్ణ కృష్ణ ముకుందా’ అన్న జ్ఞాన పానముతో, ఆపై ‘శ్రీరంగ పుర విహార’ అన్న కీర్తనలకు భరతనాట్య సంప్రదాయంలో హరినీజీవిత, భైరవి వెంకటేష్, సుజనరమేష్, కామేశ్వరి గణేష్, రమ్య, ప్రియా, హర్షిత, స్నేహ నర్తించి సభాప్రాంగణాన్ని మైమరపించారు.

ఈ భరతనాట్యం పూర్తిగా శ్రీదేవి నృత్యాలయా తరపున డా||షీలా ఉన్నికృష్ణన్ కొరియోగ్రాఫేర్ & నట్టువాంగం ఆధ్వర్యంలో, చిత్రామ్బరి గానం, గురు భరద్వాజ్ మృదంగం, దేవరాజ్ ఫ్లూట్ సహకారంతో జరిగింది.

అదేవిధంగా, తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సా.6.30 – 8.30 గంటల వరకు ఉన్నికృష్ణన్ బృందం భక్తి సంగీతం వినిపించారు. తిరుపతి రామచంద్ర పుష్కరిణిలో సా.6.30 -8.30 గంటల వరకు కాకినాడకు చెందిన ఎం.రాణి బృందం తోలుబొమ్మలాట ఆకట్టుకుంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.