JEO RELEASES SKVST BTU POSTERS _ ఫిబ్రవరి 11 నుంచి శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు- పోస్టర్లు, బుక్‌లెట్లు ఆవిష్కరించిన జేఈవో శ్రీ వీరబ్రహ్మం

TIRUPATI, 02 FEBRUARY 2023: TTD JEO Sri Veerabrahmam released the posters of annual brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy in Srinivasa Mangapuram which is scheduled between February 11 to 19 with Ankurarpanam on February 10.

 

The event took place at his chambers’ in TTD Administrative Building in Tirupati on Thursday. He said all the arrangements for the big festival are underway and the important days includes Dhwajarohanam on February 11, Garuda Seva on February 15, Golden Chariot on February 16, Radhotsavam on February 18 and Chakrasnanam on February 19.

 A

Special Grade DyEO Smt Varalakshmi, Superintendent Sri Chengalrayalu, Temple Inspector Sri Kiran Kumar Reddy and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

 

ఫిబ్రవరి 11 నుంచి శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు

– పోస్టర్లు, బుక్‌లెట్లు ఆవిష్కరించిన జేఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి, 2023 ఫిబ్రవరి 02: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 11 నుండి 19వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల పోస్టర్లు, బుక్‌లెట్ల‌ను జేఈవో
శ్రీ వీరబ్రహ్మం గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, ఫిబ్రవరి 11 నుంచి 19వ తేదీ వరకు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కోవిడ్ కారణంగా, రెండు సంవత్సరాల తర్వాత స్వామివారి వాహన సేవలు ఆలయ నాలుగు మాడ వీధుల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 11వ తేదీ ఉద‌యం 8.40 నుండి 9 గంట‌ల మ‌ధ్య‌ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఫిబ్రవరి 15న రాత్రి గరుడ వాహనము, ఫిబ్రవరి 16న సాయంత్రం 4 గంటలకు బంగారు రథం, ఫిబ్రవరి 18న రథోత్సవం, ఫిబ్రవరి 19న చక్రస్నానం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, సూప‌రింటెండెంట్
శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.