SNAPANA TIRUMANJANAM IN KUPUCHANDRA PETA_ ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం
Tirupati, 20 Feb. 19: The peta festival of the Sri Kodandarama Swamy Varu was grandly performed on Wednesday.
The utsava idols of Sri Sita Lakshmana and Sri Kodandarama were taken in a procession to the Kupu Chandrapeta this evening. The Idols were earlier taken in a procession from the Sri Kodandarama Swamy Temple in Tirupati in the morning and Snapana Tirumanjanam was also performed as per temple traditions annually on the occasion of Magha masam Pournami day.
The unjal Seva was performed to the deities before departure to Tirupati. The artists of HDPP and Dada Sahitya presented bhajans and kolatas.
Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy, Temple DyEO Sri Sridhar, AEO Sri Tirumalaiah, Supdt Sri Munikrishna Reddy and other officials and devotees participated.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం
తిరుపతి, 2019, ఫిబ్రవరి 20: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం బుధవారం ఘనంగా జరిగింది. మాఘపౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీ.
ఉదయం 6.00 గంటలకు ఆలయం నుండి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఊరేగింపు బయల్దేరింది. ఉదయం 8.30 గంటలకు తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు చేరుకుంది. అక్కడ ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం చేశారు.
అనంతరం సాయంత్రం 4.00 నుంచి 5.00 గంటల వరకు ఊంజల్‌సేవ చేపడతారు. సాయంత్రం 5.30 గంటలకు అక్కడి నుండి బయల్దేరి రాత్రి 9.00 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగిన స్వామివారి ఊరేగింపులో టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ శ్రీధర్, ఏఈవో శ్రీ తిరుమలయ్య, సూపరింటెండెంట్ శ్రీ మునికృష్ణారెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.