JEO REVIEWS TTD EMPLOYEES ISSUES_ టిటిడి ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై జెఈవో స‌మీక్ష

Tirupati, 15 Jun. 19: TTD Joint Executive Officer in Tirupati Sri B Lakshmi Kantham has urged officials to speedily resolve all Issues of employees working in TTD establishments.

Speaking after a review meeting at TTD administrative building on Saturday morning, the JEO directed officials to speedily complete on-going civil and electrical works in the employees quarters at Vinayak Nagar, Ram Nagar, the compound wall at Sri Govindarajaswamy and Sri Kodandaramaswami quarters. He also advised employees to form coop-housing societies to beget housing plots.

He advised that a seniority list of TTD employees be prepared for speeding up promotions, and for rendering cashless health initiatives for all staffers. He directed officials for set up sports grounds to promote Shuttle, badminton and other wellness games.

The JEO also reviewed the audit issues in all TTD departments.

TTD DyEOs Smt Gautami, IAS, Chief Engineer Sri Chandrasekhar Reddy, FA and CA Sri O Balaji, Joint Director of Audit Smt Lata, CAO Sri Shailendra, SE1 Sri Ramesh Reddy, Estate Officer Sri. Vijayadarathi, DyEOs Sri Kasturi Bai, Smt Snehalata, Smt Malleswari, Sri Lakshmi Narasimha, Sri Damodaram and others participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై జెఈవో స‌మీక్ష

తిరుపతి, 2019 జూన్ 15: టిటిడిలో విధులు నిర్వ‌హించే ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను వేగంగా ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకొవాల‌ని టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని జెఈవో కార్యాల‌యంలో శ‌నివారం అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ ఉద్యోగుల‌కు కేటాయించిన వినాయ‌క న‌గ‌ర్‌, రాంన‌గ‌ర్‌, శ్రీ గోవింద‌రాజ‌స్వామి, శ్రీ కోదండ‌రామ‌స్వామి క్యార్ట‌ర్స్‌లో ప్ర‌హ‌రీ నిర్మాణం, ఇత‌ర సివిల్‌, ఎల‌క్ట్ర‌క‌ల్ ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఉద్యోగుల ఇంటి స్థ‌ల‌ల‌కు సొసైటి ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు.

అదేవిధంగా ఉద్యోగుల ప‌దోన్న‌త‌ల‌కు జాబితాను సిద్దం చేయాల‌న్నారు. ఉద్యోగుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని న‌గ‌దు ర‌హిత వైద్యం అందించేందుకు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేయాల‌న్నారు. ఉద్యోగుల‌కు ష‌టిల్‌, బ్యాట్‌మెంట‌న్ త‌దిత‌ర క్రీడ‌లు ఆడేందుకు వీలుగా క్రీడా మైదానాన్ని నిర్మించాల‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడిసిఇ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, ఎస్టేట్ అధికారి శ్రీ విజ‌య‌సార‌ధి, డెప్యూటీ ఈవోలు శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, శ్రీ‌మ‌తి స్నేహ‌ల‌త‌, శ్రీ‌మ‌తి మ‌ల్లీశ్వ‌రి, శ్రీ దామోద‌రం, శ్రీ ల‌క్ష్మీన‌ర‌స‌మ్మ‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ఆడిట్‌పై జెఈవో స‌మీక్ష

టిటిడిలోని వివిధ విభాగాల‌లోని ఆడిట్ అంశాల‌ను త్వ‌రిత గ‌తిన ప‌రిష్క‌రించాల‌ని టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో జెఈవో, అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

టిటిడిలో 2015-16, 2016-17 ఆర్ధిక సంవ‌త్స‌రాల‌కు సంబంధించి వివిధ శాఖ‌ల‌లోని ఆడిట్ అంశాల‌పై రూ.35 కోట్ల అభ్యంత‌రాలు ఉండేవ‌ని జెఈవో తెలిపారు. ఇందులో దాదాపు రూ. 14 కోట్ల ఆడిట్ అభ్యంత‌రాల‌ను ప‌రిష్క‌రించిన‌ట్లు తెలియ‌జేశారు. మిగిలిన రూ.21 కోట్ల‌కు సంబంధించి ఆడిట్ నోట్‌ను స‌మ‌ర్పించిన‌ట్లు వివ‌రించారు. టిటిడిలోని వివిధ శాఖ‌ల అధికారులు నియ‌మ నిబంధ‌న‌లు, పాల‌న ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను అమ‌లుచేస్తే భ‌విష్య‌త్తులో ఎలాంటి ఆడిట్ అభ్యంత‌రాలు ఉండ‌వ‌న్నారు. వివిధ శాఖ‌ల‌లో ఆడిట్ కు సంబంధించి క్ర‌మం త‌ప్ప‌కుండా ప‌రిష్క‌రించుకుంటే ఎలాంటి అభ్యంత‌రాలు ఉండ‌వ‌ని తెలిపారు. ఆడిట్ లో అభ్యంత‌రాలు ఉంటే ఎప్ప‌టిక‌ప్పుడు ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకు వ‌చ్చి ప‌రిష్క‌రించుకోవాల‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఎఫ్ఎ అండ్ సిఏవో శ్రీ బాలాజి, ఆడిట్ సంయుక్త సంచాల‌కులు శ్రీ‌మ‌తి ల‌త‌, సిఏవో శ్రీ శేష‌శైలేంద్ర‌, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.