PEARL KAVACHAM FOR MALAYAPPASWAMY AND HIS CONSORTS_ ముత్యపు కవచంలో మురిపించిన శ్రీ మలయప్ప

Tirumala, 15 Jun. 19: On day-2 of the ongoing annual Jyestabhisekam at Srivari temple, the utsava idols of Sri Malayappaswamy and his consorts were adorned with Pearl kavacham.

Earlier after morning rituals the temple priests and Veda parayanadars performed Maha Shanti Homam and later Abhideyaka abhisekam in the afternoon.

Later in the evening Pearl kavacham was draped to the utsava idols of Sri Malayappaswamy and his consorts and Sahasra deepalankara seva was performed.

In view of the Jyestabhisekam and Pearl kavacham Dharana that is a once in a year festival, the TTD has cancelled other arjita sevas like Vasantotsavam on Saturday.

Temple Peishkar Sri Lokanatham, Parupattedar Sri Ramachandra participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ముత్యపు కవచంలో మురిపించిన శ్రీ మలయప్ప

తిరుమ‌ల‌, 2019 జూన్ 15: తిరుమల శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు శనివారంనాడు శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను మురిపించాడు.

అంతకుముందు ఉదయం 6.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు మరియు వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారికి, దేవేరులకు అభిదేయక అభిషేకాన్ని కన్నులపండుగగా చేపట్టారు.

సాయంత్రం శ్రీ మలయప్పస్వామివారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్రదీపాలంకార సేవలో ఊయలమీద స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించాడు. కాగా సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్దమనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఈ కార‌ణంగా ఆర్జిత వసంతోత్సవ సేవను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో ఆల‌య పేష్కార్ శ్రీ లోక‌నాథం, పార్‌పత్తేదార్ శ్రీ రామ‌చంద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.