STUNNING RESPONSE TO PWFS_ పిడబ్ల్యుఎఫ్ఎస్ సేవకు విశేష స్పంద‌న‌

* Supervision of devotees amenities in VQC compartments
* Gazetted /supervisor cadres preferred
* Online registration facility

Tirumala, 15 Jun. 19: The stellar contributions of the Pilgrims Welfare Facilitation Service (PWFS) launched launched by TTD since May3rd, 2019, to oversee the services rendered to devotees especially in the VQC compartments has received spectacular response.

The new corps of volunteers was roped in to ensure that all the facilities provided by TTD reached the target beneficiaries- devotees of all categories— in the queue lines of Vaikuntam queue complex-1 and 2. Their task was to coordinate with Srivari Sevakulu and TTD staff and ensure that all Anna Prasadam, coffee, tea, buttermilk, snacks, and drinking water, milk for children n reached the waiting devotees. They also monitored the waiting time of devotees in the compartments, frequency of queue lines release, garbage clearance and cleanliness etc. Nearly 50 member corps worked in two shifts from morning 8 am to night 8pm in the compartments.

For service in the PWFS the TTD preferred devotees, both men and women in 35-65 years age group and especially Gazetted officers or supervisory cadres in corporate sector.

For online registration in the PWFS the interested persons should click on Srivari Seva link in the TTD website -www.tirumala.org and opt for available slots of 7 days or 15 days service. Later on the registered devotees should report for service at the Srivari Seva complex behind the Kalyana vedika.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పిడబ్ల్యుఎఫ్ఎస్ సేవకు విశేష స్పంద‌న‌

కంపార్ట్‌మెంట్ల‌లో యాత్రికుల సౌక‌ర్యాల ప‌ర్య‌వేక్ష‌ణ‌

గెజిటెడ్ లేదా సూప‌ర్‌వైజ‌ర్ స్థాయివారు అర్హులు

ఆన్‌లైన్లో న‌మోదు చేసుకునే అవ‌కాశం

తిరుమ‌ల‌, 2019 జూన్ 15: తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ద‌ర్శ‌నానికి ప్ర‌పంచం న‌లుమూల‌ల నుండి విచ్చేసే భ‌క్తుల‌కు మ‌రింత మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు టిటిడి నూత‌నంగా ప్ర‌వేశ పెట్టిన యాత్రికుల సంక్షేమ, సౌక‌ర్యాల‌ సేవ (పిలిగ్రిమ్ వెల్ఫేర్ ఫెసిలిటేష‌న్ స‌ర్వీస్ – పిడబ్ల్యుఎఫ్ఎస్)కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ఈ ఏడాది మే 3వ తేదీ నుండి పిడబ్ల్యుఎఫ్ఎస్ సేవ‌కులు కంపార్ట్‌మెంట్ల‌లో సేవ‌లందిస్తున్నారు. ఎక్కువ‌మంది ఈ సేవ‌కు రావ‌డం ద్వారా యాత్రికుల‌కు మ‌రింత నాణ్య‌మైన సేవ‌లందించే అవకాశ‌ముంటుంద‌ని టిటిడి భావిస్తోంది.

టిటిడి క‌ల్పిస్తున్న సౌక‌ర్యాలను కంపార్ట్‌మెంట్ల‌లో వేచి ఉన్న యాత్రికుల‌కు చేర్చ‌డ‌మే ఈ సేవ ముఖ్య ఉద్దేశం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 ల‌లోని కంపార్ట్‌మెంట్ల‌లో భ‌క్తులు వేచి ఉండే స‌మ‌యం, ద‌ర్శ‌నానికి వ‌దిలే స‌మ‌యం, అన్న‌ప్ర‌సాదాల వివ‌రాలు ఎల్ఇడి స్క్రీన్‌ల‌లో స‌రిగ్గా ప్ర‌ద‌ర్శిత‌మ‌య్యేలా చూడాలి. అదేవిధంగా యాత్రికుల‌కు అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, టి, కాఫి, చంటిపిల్ల‌ల‌కు పాలు స‌క్ర‌మంగా అందేలా, పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండేలా ప‌ర్య‌వేక్షించాలి. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల‌లో వైద్య స‌దుపాయాలు అందించేలా అప్ర‌మ‌త్తంగా ఉండాలి. భ‌క్తులకు అవ‌స‌ర‌మైన ఇత‌ర ముఖ్య‌ స‌మాచారాన్ని అందించాలి. ఉద‌యం 8 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 4 నుండి మ‌రుసటిరోజు ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు రెండు షిఫ్టుల్లో క‌లిపి ప్ర‌స్తుతం 50 మంది పిడబ్ల్యుఎఫ్ఎస్ సేవ‌కులు కంపార్ట్‌మెంట్ల‌లో సేవ‌లందిస్తున్నారు.

పిడబ్ల్యుఎఫ్ఎస్ సేవ‌కు విచ్చేసే మ‌హిళ‌లు, పురుషులు 35 నుండి 65 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు క‌లిగి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర‌ ప్ర‌భుత్వ శాఖ‌ల‌లో గెజిటెడ్ హోదా క‌లిగి ఉండాలి. అదేవిధంగా ప్రైవేట్ రంగ సంస్థ‌ల‌లోనివారికి ప‌ర్య‌వేక్ష‌ణ (సూప‌ర్‌వైజ‌ర్) స్థాయిలో నిర్వ‌హ‌ణ సామ‌ర్థ్యం ఉండాలి.

యాత్రికుల సంక్షేమ, సౌక‌ర్యాల సేవ కోసం టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.orgలో ‘శ్రీవారిసేవ’ అనే లింక్‌ను క్లిక్ చేయాలి. ఇందులో పిలిగ్రిమ్ వెల్ఫేర్ ఫెసిలిటేష‌న్ స‌ర్వీస్ ను ఎంపిక చేసుకోవాలి. 7 రోజులు లేదా 14 రోజుల స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవ‌ను పొందినవారు తిరుమ‌ల‌లోని క‌ల్యాణ వేదిక వెనుక వైపు గ‌ల శ్రీ‌వారి సేవ భ‌వ‌న స‌ముదాయంలో రిపోర్టు చేయాలి.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.