NYAYA SUDHA PARAYANAM BEGINS AT SRI VARI TEMPLE _ తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన శ్రీమాన్‌ న్యాయసుధా పారాయణం

Tirumala,10 July 19 : As part of annual Event Of Sri Jayathirtha Aradhanotsavam the recital of Sri Nyayasudha Parayanam commenced at Srivari temple on Wednesday morning .

The Parayanam will be held both morning and evening hours in two phases from July 10-14 and July 18-August 22,

The Vedic exponents will recite vedas, upanishads ,puranam etc in the Srivari temple for sake of Loka Kalyanam ,prosperity and rains etc .

Under the supervision Sri PR Ananda Thirthacharya OSD of TTDs Dasa Sahitya Project such Parayanam is also conducted at Srikrishna temple ,Udipi and at original Brindavan of Sri Jayathirtha at Malkhed in Gulbarga District Of Karkataka.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన శ్రీమాన్‌ న్యాయసుధా పారాయణం

తిరుమల, 2019 జూలై 10 ; కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీమాన్‌ న్యాయసుధా పారాయణం బుధ‌వారం ఉదయం 6.00 గంటలకు ఘనంగా ప్రారంభమైంది. శ్రీ జయతీర్థుల ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని జూలై 14వ తేదీ వరకు, తిరిగి జూలై 18 నుండి ఆగస్టు 22వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జరుగనుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఈ పారాయణం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీవారి ఆలయంలోని విమాన వేంకటేశ్వరస్వామివారికి ఎదురుగా 11 మంది వేద పారాయణదారులు సకల శాస్త్రాములను పారాయణం చేశారు. ఇందులో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ధర్మశాస్త్రాలను పారాయణం చేశారు. శ్రీవారి సన్నిధిలో న్యాయసుధా పారాయణం చేయడం వలన లోకం సుభిక్షంగా ఉంటుందని, అనేక సంవత్సరాలుగా టిటిడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.

టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో క‌ర్ణాట‌క రాష్ట్రం ఉడిపిలోని శ్రీ కృష్ణస్వామివారి సన్నిధి, శ్రీ ఉత్త‌రాది మ‌ఠం, గుర్భ‌ర్గా జిల్లా మాల్ఖేడ్‌లోని శ్రీ జ‌య‌తీర్థుల మూల బృందావ‌నంలోను న్యాయసుధా పారాయణం నిర్వహిస్తున్నారు. టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థచార్యులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.