JYESTABHISHEKAM COMMENCES AT SRI GT_ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం

Tirupati, 12 Jul. 19: The annual Jyestabhishekam commenced in Sri Govinda Raja Swamy temple on Friday in Tirupati on the advent of the auspicious Jyesta star in the month of Ashada.

As a part of the fete, Satakalasa Snapanam and Maha Shanti Homam were held and the deities of Sri Govinda Raja Swamy, Sridevi and Bhudevi were given Snapana Tirumanjanam in the morning. Later in the evening the procession of Tiruchi held.

HH Sri Chinna Jiyar Swamy of Tirumala, Spl.Gr.DyEO Smt Varalakshmi and other office staff were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం

జూలై 12, తిరుపతి, 2019: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్ఠాభిషేకం శుక్ర‌వారం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఆషాఢ మాసంలో జ్యేష్ఠా నక్షత్రం నుంచి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి కైంకర్యాలు నిర్వహించారు. ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు శ‌త‌క‌ల‌శ‌స్న‌ప‌నం, మ‌హాశాంతి హోమం చేప‌ట్టారు. ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ల‌తో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం స్వామివారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాఢ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్‌, ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఇవో శ్రీ ర‌విప్ర‌కాష్‌రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ జ్ఞానప్రకాష్‌, శ్రీ శ్రీ‌హ‌రి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణమూర్తి, శ్రీ ప్ర‌శాంత్‌, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.