KAISIKA DWADASI ON NOVEMBER 13 _ నవంబరు 13న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానం
PROCESSION OF UGRA SRINIVASA MURTY IN TIRUMALA
TIRUMALA, 01 NOVEMBER 2024: The once-in-a-year event, the procession of Sri Ugra Srinivasa Murty in Tirumala on the auspicious occasion of Kaisika Dwadasi will take place on November 13.
About the unique idol:
Among the Pancha Beras(five types of idols), Ugra Srinivasa Murty is considered as the Snapana Beram.
The idol of Sri Ugra Srinivasa Murthy was also known as Venkatatturaivar and stands for the anger aspect of the Lord.
Ugra Srinivasa was used as the processional deity in the good olden days.
SIGNIFICANCE
Immense importance is attached to the festival, which according to mythology is revered as one of the most important religious events in the Sri Vaishnava Kshetrams.
Legends say that the event arises out of Kaisika Puranam consisting of 82 slokas, a story which was told by Sri Varaha Swamy to Bhudevi.
STORY OF NAMBADUVAN
A great devotee of the Lord, Sri Nambaduvan (also known as Satyamurthi) being confronted by a Brahma Rakshasa (Demon) on his way to the temple.
This Rakshasa used to be a Brahmin by the name of Soma-Sharma. He committed some grave mistakes during a Yagam and was cursed to become a Brahma Rakshasa.
When Nambaduvan was traveling to the temple, a demon stops him to become his prey. After great persuasion, Nambaduvan tells the Rakshasa that he would return to be eaten by him after completing his annual offering of music to Nambi Perumal.
The Rakshasa allows him to proceed to the temple. After singing songs in Kaisika Ragam, all night in front of the Lord, Nambaduvan comes back to Rakshasa to fulfill his promise.
At that time, Sri Mahavishnu, to testify the devotion and commitment of Nambaduvan, in the guise of an old man, stops him and asks him to take another route, to escape from becoming prey to the demon.
Nambaduvan refuses to break his promise and proceeds to meet his death. The Demon was surprised at his honesty when he sees Nambaduvan coming to him. Later the truthfulness of Nambaduvan impresses Lord who offers him salvation also breaks the curse of Demon.
In view of this, in Tirumala, only on this day of Kaisika Dwadasi, Sri Venkatatturaivar, is taken out of the temple on a procession and that too before sunrise.
WHY BEFORE SUNRISE
The reason is that in the 14th Century, there was huge fire accident in Tirumala when there was a procession of Sri Ugra Srinivasa Murthy (the anger form) as soon as the Sun rays fell on the idol. Since then the procession is being observed before the sunrise followed by Asthanam.
ASTHANAM
After the procession, Kaisika Dwadasi Asthanam to the deities will be observed inside the temple. The Vedic pundits read out the story from Kaisika Puranam during the temple court organized at Bangaru Vakili between 6am and 7:30am.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నవంబరు 13న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానం
తిరుమల, 2024 నవంబరు 01: నవంబరు 13వ తేదీన కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు.
చారిత్రక వివరాలలోనికి వెళితే కైశిక ద్వాదశిని ప్రబోధనోత్సవం అని, ఉత్తానద్వాదశి అని కూడా వ్యవహరిస్తారు. వివిధ గ్రంధాల్లో పేర్కొన్న విధంగా స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు ఆషాఢశుక్ల ఏకాదశినాడు గాఢ నిద్రలోకి వెళ్ళారు. కైశికద్వాదశినాడు ఆయనను మేల్కొల్పు చేయడం రివాజు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవాన్ని ప్రతిఏటా టిటిడి ఘనంగా నిర్వహిస్తుంది.
ప్రాశస్త్యం..
పురాణాల ప్రకారం శ్రీవైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైశికద్వాదశి ఒకటి. శ్రీ వరాహ స్వామి కైశికపురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైశిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైశిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది.
నంబదువాన్ కథ…
కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెలుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. అందుకు నంబదువాన్ సమాధానంగా తాను ప్రస్తుతం శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.
సూర్యదయానికి ముందే ఎందుకు?
14వ శతాబ్దంలో ఉగ్రశ్రీనివాసమూర్తి ఊరేగింపు జరుగుతూ ఉండగా సూర్య కిరణాలు స్వామివారి విగ్రహం మీద పడగానే భాగీ అగ్ని ప్రమాదం జరిగింది. అప్పటి నుండి సూర్యోదయానికి ముందే ఊరేగింపు నిర్వహిస్తున్నారు.
ఆస్థానం
ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా సూర్యోదయానికి ముందే తెల్లవారుఝామున ఆలయ అర్చకులు తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 6 నుండి ఉదయం 7.30 గంటల వరకు కైశిక ద్వాదశి ఆస్థానాన్ని పురాణ పారాయణం ద్వారా ఘనంగా నిర్వహిస్తారు. దీనితో సాలకట్ల కైశికద్వాదశి ఉత్సవం పూర్తవుతుంది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.