KALIYA MARDHANA BLESSES DEVOTEES _ కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం
Vontimitta, 17 April 2022: Sri Kodanda Rama in the guise of Kaliyamardhana blessed His devotees on Sunday as part of ongoing annual Brahmotsavams in Vontimitta at YSR Kadapa
district.
After Vahana Seva Snapana Tirumanjanam was performed. Later in the evening Unjal Seva will be performed.
DyEO Sri Ramana Prasad and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం
ఒంటిమిట్ట, 2022 ఏప్రిల్ 17: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవరోజు ఆదివారం ఉదయం కాళీయమర్దనాలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు.
వాహనసేవ అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.
అశ్వవాహనం :
శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనం పై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ, తన నామ సంకీర్తనలతో కలి దోషాలకు దూరంగా ఉండి తరించమని ప్రబోధిస్తున్నారు.
వాహనసేవలో డెప్యూటీ ఈవో శ్రీ రమణప్రసాద్, ఏఈవో శ్రీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ శ్రీ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 18న చక్రస్నానం
శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు చక్రస్నానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7.00 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఏప్రిల్ 19న పుష్పయాగం
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం సాయంత్రం 6 నుండి రాత్రి 9.30 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.