KODANDARAMA RIDES ASWA VAHANA _ అశ్వవాహనంపై శ్రీరామచంద్రుడి వైభవం

Vontimitta, 17 April 2022: As part of the ongoing Sri Ramanavami Brahmotsavam of Sri Kodandarama Swamy temple at Vontimitta in YSR Kadapa district on Sunday Aswa vahana Seva was observed.

Upanishads and other puranic legends speak volumes about elements iconised as Horse or Aswa.

Krishna Yajurveda identifies Swami as Aswa and hence Swami is riding Aswa as Kalki and preaches to His devotees to perform Nama Smarana for achieving bliss and avert all Doshas.

DyEO Sri Ramana Prasad and other officials were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అశ్వవాహనంపై శ్రీరామచంద్రుడి వైభవం

ఒంటిమిట్ట, 2022 ఏప్రిల్ 16: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు ఆదివారం రాత్రి స్వామివారు అశ్వ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. ఆల‌య నాలుగు మాడ వీధుల్లో భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వ వాహనం పై భక్తులకు దర్శనమిచ్చి తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ తన నామ సంకీర్తన లతోకలిదోషాలకు దూరంగా ఉండమని ప్రబోధిస్తున్నారు.

వాహ‌న‌సేవ‌లో డెప్యూటీ ఈవో శ్రీ‌ రమణప్రసాద్, ఏఈవో శ్రీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ శ్రీ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయ, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.