KANCHI PONTIFF LAUDS TTD GO SEVA PROGRAMS _ అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ శాలను సందర్శించిన కంచిపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి

Tirupati, 11 December 2021: The Pontiff of Kanchi Kamakoti Peetham HH Sri Sri Sri Vijayendra Saraswati Swamy on Saturday TTD Goshala program and Go Seva campaign activities.

After visiting the Saptha Go Pradakshina Mandiram at AIpiri the Kanchi Pontiff told reporters that Go Puja begets prosperity and Go puja should be performed at every temple daily.

Earlier he performed Go puja and presented fodder and bananas to cows and also visited the Go Thulabharam.

He lauded that the AP CM Sri YS Jaganmohan Reddy for maintaining a Goshala at his residence and urged people to follow him as an example.

He also lauded TTD Chairman Sri YV Subba Reddy for the massive Go Samrakshana campaign taken up by the TTD and also the recent Go Maha Sammelan held at Tirupati.

TTD Chairman Sri YV Subba Reddy, Chandragiri MLA and TTD board Ex-officio member Dr Chevireddy Bhaskar Reddy, TTD board member Sri Vaidyanathan Krishnamurthy, Additional EO Sri AV Dharma Reddy, Chennai local advisory committee Chairman Sri Sekar Reddy, RTC vice chairman Sri Vijayananda Reddy, SV Goshala Director Dr Harnath Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

గో పూజతో అష్టైశ్వర్యాలు
– ముఖ్యమంత్రి గోశాల ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం
– టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గోసేవ గొప్పగా జరుగుతోందని అభినందన

– అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ శాలను సందర్శించిన కంచిపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి

తిరుపతి 11 డిసెంబరు 2021: గో పూజ వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, ప్రతి గుడిలో ప్రతి రోజు గో పూజ జరిగేలా ఏర్పాట్లు చేయాలని కంచిపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి అన్నారు.

అలిపిరి వద్ద నిర్మించిన సప్త గో ప్రదక్షిణ శాల ను శనివారం స్వామి సందర్శించారు. గో పూజ చేసి, సప్త గోవులకు ప్రదక్షిణ చేశారు. గోవులకు దాణా, గ్రాసం, అరటిపండ్లు పెట్టారు. అనంతరం గో తులాబారాన్ని సందర్శించి దాణా ను అందించారు.

ఆ తర్వాత కంచి స్వామి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో దేశీయ గోశాల ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ప్రజలందరూ ఇదే బాటలో గో సంరక్షణకు పూనుకోవాలని పిలుపునిచ్చారు. టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గో సంరక్షణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, ఇటీవల జాతీయ గో మహాసమ్మేళనం పెద్ద ఎత్తున నిర్వహించారని అభినందించారు. సనాతన హిందూ ధర్మం, సంస్కృతి లో గో పూజ కు పెద్ద పీట వేశారన్నారు. గోవు జంతువు కాదని భక్తుల కోరికలు తీర్చే కామధేనువని స్వామి తెలిపారు. ఎందరో మహా రాజులు, మహర్షులు గో పూజ చేసి తరించారని, రాజ్యం కన్నా గోవే ముఖ్యమనకున్న మహానుభావులు ఎందరో ఉన్నారన్నారు. అలిపిరి వద్ద టీటీడీ నిర్మింపజేసిన సప్త గో ప్రదక్షిణ శాల అందంగా, శాస్త్రీయంగా, ఆకర్షణ గా ఉందన్నారు.

టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, శాసన సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీ వైద్యనాథన్ కృష్ణమూర్తి, అదనవు ఈవో శ్రీ ధర్మారెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, చెన్నె స్థానిక సలహా మండలి చైర్మన్ శ్రీ శేఖర్ రెడ్డి, ఆర్టీసి వైస్ ఛైర్మన్ శ్రీ విజయానంద రెడ్డి, ఎస్వీ గో శాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది