EXCERPTS DURING THE BOARD MEETING _ టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

TIRUMALA, 11 DECEMBER 2021: The TTD Trust Board meeting was held at Annamaiah Bhavan in Tirumala on Saturday under the Chairmanship of TTD Chairman Sri YV Subba Reddy. Ex-officio members including TTD EO Dr KS Jawahar Reddy, Endowments Principal Secretary Smt Vani Mohan, TUDA Chairman Dr C Bhaskar Reddy and other members, TTD officials were also present.

SOME EXCERPTS DURING THE BOARD MEETING:

·      Similar to Srivari Brahmotsava Darshanam, it has been decided to provide Srivari Vaikunthadwara darshanam to the devotees of SC/ST/BC/fishermen colonies

·      Decided to enhance darshan quota and limited number of Arjita Sevas in the new year in view of reduction in Covid intensity and to send a proposal on the same seeking permission from State and Central governments

·      Inviting donations to construct Paediatric Hospital in a full-fledged manner. As a privilege, the donors decided to resume Udayastamana Sevas which was stalled quite some time ago.

·      Anjana Devi temple premises in Akasa Ganga which is declared as Hanuman Janmasthalam and Nadaneerajanam Mandapam to be developed for the sake of pilgrims with the help of Donors.

·      Annamaiah Margam to be developed as another footpath route for pilgrims.

·      The seven temples which were completely damaged due to the collapse of Annamaiah Project at Rajampet in YSR Kadapa district due to the recent rain havoc will be renovated by TTD

·      More and more Hindu dharmic programmes like Karthika Deepotsavams, Kalyanotsavams etc. to be taken up across the Telugu states as well as in the important cities of Karnataka and Tamilnadu.

·      IT Wing to be strengthened further to launch more hassle free in-house application

·      SV Manuscript Project to be established in SV Vedic University

·      As a part of promotion of Sri Venkateswara q Venkateswara Namakoti books to devotees coming for Srivari darshanam

·      Nod to set up water heaters for the sake of devotees at HVC, ANC, GNC and other rest houses at Rs.3crores

·      Nod to construct Central Godown in SVIMS at Rs.10crores

·      To call tenders construct additional storeys for Harini Hostel block and also to make improvements in Srinivasa, Gandhi hostels in Sri Padmavathi Degree College at Rs.12.58crores

·      Purchase of two Coins Counting and Automatic Packing machines for Tirumala Parakamani at Rs.2.80crores

TTD to provide technical support to do the gold malam works for the Sivaji Gopuram in Srisailam Devasthanam

·      Restoration works of Second Ghat Road at Rs.3.95crores and Srivarimettu footpath route at Rs.3.60crores

·      To enhance piece rate for barbers from existing Rs.11/- to Rs.15/-

All the board members (five members and Endowments Commissioner Sri Harijawaharlal also participated virtually), LAC Presidents were also present.

Additional EO Sri AV Dharma Reddy, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Gopinath Jatti and other senior officials were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

తిరుమల, 2021 డిసెంబ‌రు 11: టిటిడి ధర్మకర్తల మండలి అధ్య‌క్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి అధ్య‌క్ష‌త‌న శ‌నివారం తిరుమల అన్నమయ్య భవనంలో బోర్డు స‌మావేశం జరిగింది. ధర్మకర్తల మండలి స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా 2022 జ‌న‌వ‌రి 13వ తేదీ నుండి 10 రోజుల పాటు తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని నిర్ణ‌యం.

– శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం తరహాలోనే వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మత్స్యకారులకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉచితంగా తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు నిర్ణయం.

– క‌రోనా నిబంధ‌న‌లు స‌డ‌లిస్తే కొత్త సంవ‌త్స‌రంలో మ‌రింత ఎక్కువ మంది భ‌క్తుల‌ను స‌ర్వ‌ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌డంతోపాటు ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌ను శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌కు అనుమ‌తించాల‌ని యోచిస్తున్నాం. ఇందుకోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలకు లేఖలు రాయాల‌ని నిర్ణ‌యం.

– శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు శ్రీ వేంకటేశ్వర తత్వాన్ని ప్రచారం చేసేందుకు శ్రీ వేంకటేశ్వర నామకోటి పుస్తకాలు సిద్ధం చేయాలని నిర్ణయం.

– శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రిగా మార్చేందుకు స్థ‌లాన్ని గుర్తించాం. వెంట‌నే ఆసుప‌త్రి నిర్మాణం చేప‌డ‌తాం. ఇందుకోసం ఎస్వీ ప్రాణ‌దాన ట్ర‌స్టు ద్వారా విరాళాలు అందించే దాత‌ల‌కు ఉద‌యాస్త‌మాన సేవా టికెట్లు కేటాయించాల‌ని నిర్ణ‌యం.

– తిరుమ‌లలో హ‌నుమంతుని జ‌న్మ‌స్థ‌లమైన అంజ‌నాదేవి ఆల‌య ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల‌ని, నాద‌నీరాజ‌నం వేదికను భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా తీర్చిదిద్దేందుకు మండ‌పం నిర్మించాల‌ని నిర్ణ‌యం. ఈ రెండింటిని దాత‌ల విరాళాల‌తో నిర్మించాల‌ని నిర్ణ‌యం.

– అన్న‌మ‌య్య కాలిబాట మార్గాన్ని మ‌రో న‌డ‌క‌మార్గంగా అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యం.

– ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్టు మార్గంలో రూ.3.6 కోట్ల వ్యయంతో, రెండో ఘాట్‌ రోడ్డులో రూ.3.95 కోట్ల వ్యయంతో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ఆమోదం.

– భక్తుల తలనీలాలు తీసే కల్యాణకట్ట క్షురకులకు పీస్‌రేట్‌ ఒక్కింటికి రూ.11/- నుండి రూ.15/-కు పెంచేందుకు ఆమోదం.

– కార్తీక దీపోత్సవం, శ్రీనివాస కల్యాణాలు లాంటి ధార్మిక కార్య‌క్ర‌మాలను తెలుగు రాష్ట్రాల‌తోపాటు ప్ర‌ముఖ న‌గ‌రాల్లో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం.

– రూ.3 కోట్ల వ్యయంతో యాత్రికుల సౌకర్యార్థం తిరుమలలోని ఏఎన్సి, జిఎన్సీ, హెచ్‌ విసి తదితర విశ్రాంతి గృహాల్లో వాటర్‌ హీటర్లు ఏర్పాటుకు గాను టెండర్లు ఆమోదం.

– వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా రాజంపేట స‌మీపంలోని అన్న‌మ‌య్య డ్యామ్ ప‌రివాహ‌క ప్రాంతంలో ధ్వంస‌మైన 7 ఆల‌యాలను పున‌ర్నిర్మించాల‌ని నిర్ణ‌యం.

– టిటిడిలో పరిపాలన పరమైన పలు నూతన అప్లికేషన్లలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వీలుగా ఐటి విభాగాన్ని బలోపేతం చేసేందుకు నిర్ణ‌యం.

– రూ.10 కోట్ల వ్యయంతో స్విమ్స్‌ లో సెంట్రల్‌ గోడౌన్‌ భవన నిర్మాణానికి అనుమతి మంజూరు ఆమోదం.

– రూ.12.58 కోట్ల వ్యయంతో శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలోని హరిణి హాస్టల్‌ బ్లాక్‌ లో అదనపు అంతస్థుల నిర్మాణానికి, శ్రీనివాస, గాంధీ హాస్టళ్లలో గదులను ఆధునీకరణ చేసేందుకు టెండర్లకు ఆమోదం.

– రూ.2.80 కోట్లతో తిరుమలలో నిర్మాణంలో ఉన్న‌ పరకామణి భ‌వ‌నంలో నాణేలను లెక్కించి ఆటోమేటిక్‌గా ప్యాకింగ్‌ చేసేందుకు వీలుగా రెండు యంత్రాల ఏర్పాటుకు టెండర్లు ఆమోదం.

– శ్రీశైలంలోని శ్రీశైల దేవస్థానం శివాజీ గోపురానికి గాను వారి నిధులతో రాగి కళశాలపై బంగారు తాపడం చేసి అందించేందుకు ఆమోదం.

– ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో శ్రీ వేంకటేశ్వర తాళపత్ర గ్రంథ ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణయం.

టిటిడి ఈవో డాక్ట‌ర్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శ్రీ‌మ‌తి వాణి మోహ‌న్‌, బోర్డు స‌భ్యులు డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ హరిజవహర్ లాల్, ఐదుగురు బోర్డు స‌భ్యులు వ‌ర్చువ‌ల్‌గా పాల్గొన్నారు. అదేవిధంగా అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మ‌య్య‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయ‌బ‌డిన‌ది.