CHAIRMAN, SO OFFERS SILKS TO VARASIDDHI VINAYAKA_ కాణిపాకం శ్రీ వినాయకస్వామివారికి టిటిడి ఛైర్మ‌న్ పట్టువస్త్రాల సమర్పణ

Kanipakkam, 10 Sep. 19: TTD Trust Board Chairman Sri YV Subba Reddy along with Tirumala Special Officer Sri AV Dharma Reddy presented silk vastrams to Sri Varasiddhi Vinayaka Swamy in the famous Kanipakam temple in Chittoor district on Monday.

They were given warm reception by temple EO Sri Demullu. These vastrams are being presented on the occasion of celestial Kalyanotsavam of Sri Varasiddhi Vinayaka Swamy which is performed on Tuesday evening.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కాణిపాకం శ్రీ వినాయకస్వామివారికి టిటిడి ఛైర్మ‌న్ పట్టువస్త్రాల సమర్పణ

తిరుప‌తి, 2019 సెప్టెంబ‌రు 10: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగ‌ళ‌వారం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీవైవి.సుబ్బారెడ్డి, ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఛైర్మ‌న్‌ దంపతులకు, ప్ర‌త్యేకాధికారికి కాణిపాకం ఆలయ ఈఓ శ్రీ దేముళ్లు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణం చేసి గర్భాలయంలో స్వామివారికి వస్త్ర సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.

కాణిపాకంలో సెప్టెంబరు 2న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 22వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం సాయంత్రం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి తిరుకల్యాణం జరుగనుంది. ఈ కల్యాణం కోసం టిటిడి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.