JEO TAKES PART IN GT PAVITROTSAVAMS_ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా పవిత్రాల సమర్పణ
Tirupati, 10 Sep. 19: TTD JEO Sri P Basant Kumar took part in the Pavitra Samarpana event on Monday in the ongoing Pavitrotsavams in the famous ancient shrine of Sri Govinda Raja Swamy in Tirupati.
Speaking on this occasion, the JEO said, Pavitrotsavams are usually observed to ward off the sins committed by the religious, non-religious staffs and even pilgrims either knowingly or unknowingly.
Meanwhile, on the second day of the Pavitrotsavams, the event of Pavitra Samarpana took place where the celestial thread woven garlands were decked to different deities located in the temple. With Pavitra Purnahuti, the festival will conclude on Wednesday.
Temple Sp.Gr.DyEO Smt Varalakshmi and other office staffs were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా పవిత్రాల సమర్పణ
తిరుపతి, 2019 సెప్టెంబరు 10: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం పవిత్రాల సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ సంవత్సరం పాటు ఆలయంలో జరిగిన కైంకర్యాల్లో తెలిసీ తెలియక జరిగిన దోషాల నివారణకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సాయంత్రం పురవీధుల్లో స్వామివారు దర్శనమిస్తారని, భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ముందుగా, ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తిరుమంజనం, తోమాలసేవ, అర్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. స్నపనతిరుమంజనంలో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత పవిత్రాలను ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ గోవిందరాజస్వామివారి మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, అన్ని ఉప ఆలయాలకు, మాడ వీధిలోని శ్రీ మఠం ఆంజనేయస్వామివారికి సమర్పించారు.
సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. రాత్రి 7.30 గంటల నుండి 9.00 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ రవికుమార్‌రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.