TIRUMALA BRAHMOTSAVAMS UNDER THE “EAGLE EYE” VIGILANCE SLEUTHS_ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత
Tirumala, 10 Sep. 19: The annual Brahmotsavams of Sri Venkateswara Swamy are considered to be one of the most important Hindu religious events that are being observed with aplomb and celestial grandeur every year in the Hill Town of Tirumala.
This nine-day fete is witnessed by tens of thousands of devotees thronging from across various parts of the country and even overseas to catch-up a glimpse of the Universal Supremo Sri Venkateswara Swamy on 16 different Vahanams during this annual festival.
In order to provide a smooth darshan of both the presiding deity as well the vahana sevas of Lord, the mandarins of TTD make elaborate arrangements which commence two months prior. Year after year, along with the increase in pilgrim rush, the improvisation in the arrangements by TTD aims at providing hassle-free darshan environment to every common devotee taking part in this mega religious fest.
To provide smooth conduct of Brahmotsavams, the Vigilance Wing of TTD along in co-ordination with the police department is also making a wide range of arrangements, leaving no stone unturned during this year, keeping in view the past experiences.
1600 PLUS CC CAMERAS TO VIGIL THE EVENT
According to the TTD Vigilance officials, apart from the existing 585 cameras, another 1051 cameras will be set up at different vulnerable points in Tirumala including VQC 1, 2, Inner and Outer Cordon, Four Mada Strerisk-free ensure risk free festival.
SPECIAL TEAMS BY VIGILANCE
To safeguard the pilgrims from the miscreants, the Vigilance sleuths in three special mufti teams will be on rounds 24X7 during the nine-day fete especially on Garuda Seva Day. To check the price hikes by the hoteliers, a special squad consisting of Vigilance, Estate and Revenue officials will do the surprise checks and raids.
JEEP PRICES FIXED
The TTD has also fixed price at Rs.70 per person who travels in private jeeps. A meeting was already conducted with all the private jeep owners, drivers in this regard on August 4 by TTD Vigilance wing and were given clear instructions that over crowding, over charging and over speeding jeeps will be given serious punishment.
1000 PERSONNEL TO VIGIL GARUDA SEVA
On Garuda Seva day on October 4, about 1000 personnel will be manning the celestial procession which includes 350 Vigilance sleuths, 150 Home Guards, 200 each Srivari Sevakulu and Scouts, 100 NCC.
CENTRAL COMMAND CONTROL
The Central Command Control also known as C Cube Complex will be monitoring the entire security activity in Tirumala. There are 15 staffs working under the control of a Vigilance Inspector in three shifts to observe the activities round the clock.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత
తిరుమల, 2019 సెప్టెంబరు 10: ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలలో అతి ముఖ్యమైన శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాదీ రంగరంగ వైభవంగా జరుగుతాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొత్తం 16 వాహనాలపై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తకోటికి దర్శనమిస్తాడు. ఈ ఉత్సవశోభను తిలకించేందుకు దేశం నలుమూలలతోపాటు విదేశాల నుండి కూడా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులు ప్రశాంత వాతావరణంలో శ్రీవారి మూలమూర్తితోపాటు వాహనసేవలను దర్శించుకునేందుకు వీలుగా టిటిడి యంత్రాంగం రెండు నెలల ముందు నుండే విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. ఏడాదికేడాది భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో అందుకు తగ్గట్టు టిటిడి సౌకర్యాలను మెరుగుపరుస్తోంది. ప్రతి సామాన్య భక్తునికీ సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు టిటిడి నిఘా, భద్రతా విభాగం పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
1600కు పైగా సిసి కెమెరాలతో పర్యవేక్షణ
బ్రహ్మోత్సవాల్లో మొత్తం 1600కు పైగా సిసి కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం 585 సిసి కెమెరాలు ఉండగా, అదనంగా 1051 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాలైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2, లోపలి, వెలుపలి కార్డన్, నాలుగు మాడ వీధులు తదితర ప్రాంతాల్లో ఈ సిసి కెమెరాల నిఘా ఉంటుంది.
ప్రత్యేక నిఘా బృందాలు
భక్తులకు రక్షణ కల్పించేందుకు టిటిడి నిఘా సిబ్బందితో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ప్రత్యేకంగా గరుడసేవతోపాటు బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజుల్లో వీరు వివిధ ప్రాంతాల్లో మఫ్టీలో విధుల్లో ఉంటారు. విజిలెన్స్, ఎస్టేట్, రెవెన్యూ అధికారులతో కూడిన ప్రత్యేక స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో అధిక ధరలను అరికడతారు.
రవాణా ఛార్జీల స్థిరీకరణ
తిరుమల, తిరుపతి మధ్య ప్రయివేటు ట్యాక్సీల్లో ప్రయాణించే భక్తులకు రవాణా ఛార్జీలను స్థిరీకరించారు. ఒక్కొక్కరికి రూ.70/-గా ఛార్జీ నిర్ణయించారు. ఆగస్టు 4న ప్రయివేటు ట్యాక్సీ యజమానులు, డ్రైవర్లతో సమావేశం నిర్వహించి అధిక ఛార్జీలు వసూలు, మోతాదుకు మించి ప్రయాణికులను ఎక్కించడం, అధిక వేగం తదితర విషయాలపై స్పష్టమైన సూచనలిచ్చారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
గరుడసేవనాడు 1000 మందితో మాడ వీధుల్లో భద్రతా చర్యలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 4న జరుగనున్న గరుడసేవ నాడు 1000 మందితో నాలుగు మాడ వీధుల్లో టిటిడి భద్రతా చర్యలు చేపట్టనుంది. వీరిలో 350 మంది నిఘా, భద్రతా సిబ్బంది, 150 మంది హోంగార్డులు, 200 మంది శ్రీవారి సేవకులు, 200 మంది స్కౌట్లు, 100 మంది ఎన్‌సిసి క్యాడెట్లు ఉన్నారు.
సెంట్రల్ కమాండ్ కంట్రోల్
తిరుమలలోని మొత్తం సెక్యూరిటీ యంత్రాంగాన్ని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ నుండి పర్యవేక్షిస్తారు. విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ ఆధీనంలో మొత్తం 15 సిబ్బంది మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు ఇక్కడ విధుల్లో ఉంటారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.