KANUMA PARUVETA UTSAVAM HELD IN TIRUMALA_ తిరుమలలో ఘనంగా పార్వేటు ఉత్సవం

Tirumala, 16 January 2019: On the celestial occasion of Kanuma festival, Paruveta Utsavam was held in Tirumala with religious fervour on Wednesday evening.

As a part of this fete, Sri Malayappa Swamy on one Tiruchi accompanied by Sri Krishna Swamy on another Tiruchi reached the Paruveta Mandapam located in deep woods of Seshachala ranges.

Later Sannidhi Golla offers Sri Krishna Swamy milk and butter which is customary tradition followed by harati while the same prasadams are offered to Sri Malayappa Swamy also by Sannidhi Golla. This event is followed by rendition of devotional songs by tge artistes of Annamacharya Project.

Afterwards, Sri Malayappa wearing Panchayudhas took part in the mock hunt. Some archakas threw the weapons on wild animals and enacted the same thrice. Devotees took part in large numbers in this fun filled religious event and thoroughly enjoyed the Divine Mock Hunt.

Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh, VGO Sri Manohar, Parupattedar Sri Sasidhar and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

తిరుమలలో ఘనంగా పార్వేటు ఉత్సవం

తిరుమల, 16 జనవరి 2019: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి పార్వేటి ఉత్సవము మకరసంక్రమునకు మరుసటిరోజున అనగా కనుమ పండుగనాడైన జనవరి 16వ తేదీ బుధ‌వారం తిరుమలలో అత్యంత ఘనంగా జరిగింది. అదేరోజున గోదాపరిణయోత్సవం కూడా కన్నుల పండుగగా జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్‌ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. ఈ మాలలను శ్రీవారి మూల మూర్తికి అందంగా అలంకరించారు.

బుధ‌వారం స్వామివారికి ప్రాతఃకాలారాధన పూర్తి అయిన తరువాత శ్రీమలయప్పస్వామివారు తిరుచ్చిలో వేంచేసారు. వారి వెంటనే మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణస్వామి వేంచేసారు. అనంతరం పార్వేట మండపమునకు వెళ్ళి, ఆ మండపమునందు పుణ్యాహము జరిగిన పిమ్మట మంచెలో వేంచేసారు. శ్రీస్వామివారికి ఆరాధనము, నివేదనము జరిగి హారతులు జరిగాయి. అనంత‌రం ఉభయదార్లకు తాళ్ళపాక వారికి, మఠంవారికి మర్యాదలు, స్వామివారు మండపమును వదలి ప్రాంగణమునకు వచ్చారు.

శ్రీకృష్టస్వామివారిని మాత్రము సన్నిధి గొల్లపూజ చేసిన చోటుకు వేంచేపుచేసి పాలువెన్న ఆరగింపు అయి హారతి జరిగిన పిమ్మట శ్రీమలయప్పస్వామివారి సన్నిధికి వెళ్ళారు. తరువాత ఆ గొల్ల సమర్పించిన పాలు వెన్న శ్రీమలయప్పస్వామివారికి నివేదనము హారతి అయి గొల్లకు బహుమానము జరిగింది. తరువాత శ్రీమలయప్పస్వామివారు ముందునకు కొంత దూరము పరుగెత్తి వారి తరపున అర్చకులు బాణమువేసిన పిమ్మట వెనుకకు వచ్చారు. ఇట్లు మూడుసార్లు జరిగింది. స్వామివారి వేటను తిలకించడానికి పారువేట మండపానికి వేలాదిగా భక్తులు విచ్చేసారు. శ్రీమలయప్పస్వామివారు ఉత్సవము పూర్తియి మహాద్వారమునకు వచ్చి హత్తీరాంజీవారి బెత్తమును తీసుకొని సన్నిధిలోనికి వేంచేసారు. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పారువేట ఉత్సవము ఘనంగా ముగిసింది.

ఈ ఉత్సవంలో ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, షేష్క‌ర్ శ్రీ ర‌మేష్‌బాబు, బోక్కసంసెల్‌ ఇన్‌చార్జ్‌ శ్రీ గురురాజస్వామి, ఫార్‌ఫ‌తేదార్ శ్రీ శ‌శిధ‌ర్‌, ఇతర ఉన్నతాధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.