AIMED AT DEVELOPING DESI GOW PROGENY-EO_ గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం

Tirupati, 16 Jan. 19: The SV Gosamrakshanashala of TTD is aimed at developing and sustaining desi cow breeds, said TTD EO Sri Anil Kumar Singhal.

Speaking to media persons at SV Goshala in Tirupati on Wednesday on the occasion of Kanuma festival, the EO said, as a tradition, TTD has been observing Gopuja, Tulasi Puja, Gobbemma Puja on the occasion of this celestial fete since many years. There are around 3000 cattle here and to take care of desi breeds, cow products an exclusive Gow centre is coming up ag Palamaner and the board has also agreed to develop this centre during the recent board meeting”, he added.

The EO said, at present the SV Gosamrakshana Trust holds Rs120crores in the form of donation. Every year Rs.9crores is being spent from this amount towards the development of Goshala.

SV Goshala Director Dr Harindranath Reddy was also present.

Earlier the cultural activities performed in the Goshala premises attracted huge number of local crowd.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం

రూ.42 కోట్ల‌తో టిటిడి గోసంరక్షణశాలల అభివృద్ధి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2019 జనవరి 16: వేదాలు, పురాణాల్లో పేర్కొన్న విధంగా సకల దేవతాస్వరూపాలైన గోవులను రక్షించుకునేందుకు టిటిడి రూ.42 కోట్ల‌తో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టిన‌ట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్ ఉద్ఘాటించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో బుధ‌వారం కనుమ పండుగ సందర్బంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు గోపూజ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టినట్టు తెలిపారు. ఇటీవ‌ల టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సంబంధిత రంగాల‌లో నిష్ణాతుల‌తో సంప్ర‌దించి రూ.42 కోట్ల‌తో గోశాల‌ల అభివృద్ధికి పెద్ద ఏత్తున ప్ర‌ణాళిక‌లు రూపొందించి, అమ‌లు చేస్తున్న‌ట్లు వివ‌రించారు.

పూర్వకాలం నుండి కనుమ పండుగ రోజున గోపూజకు చాల ప్రాదాన్యత ఉందన్నారు. గోవును పూజించడం వలన పాడిపంటలు పుష్కలంగా పండి లోకం సుభిక్షంగా వుంటుందని తెలిపారు. తిరుపతి, పలమనేరులోని గోశాలలో 3000 పశువులు ఉన్నాయని, వీటిలో పలు అరుదైన జాతుల గోవులు ఉన్నాయని వివరించారు.

ఇప్పటి వరకు దాతాలు రూ.120 కోట్లకు పైగా ”ఎస్వీ గో సంరక్షణట్రస్టు” విరాళాలు అందించినట్లు తెలిపారు. త‌ద్వార రూ.9 కోట్లు ఆదాయం ల‌భిస్తుంద‌న్నారు. దేశవాళీ గోవులను అభివృద్ధి చేయాలని, వాటి పంచగవ్యఉత్పత్తుల ప్రాముఖ్యతను ప్రజలకు తెలిపేందుకు టిటిడి కృషి చేస్తుందన్నారు. పంచగవ్య ఉత్పత్తుల ద్వారా రైతులు ఖర్చులు తగ్గించుకుని ఆదాయం పెంచుకునేందుకు టిటిడి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంద‌న్నారు. భూమికి హని చేసే రసాయన ఏరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు ఉపయోగించాలన్నారు. ప్రభుత్వ సహకారంతో గో సంపదను కాపాడేందుకు విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అంతకుముందు ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గోశాలలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గౌరిపూజ, తులసిపూజలో పాల్గొన్నారు.అటుతర్వాత గజరాజు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించి, వాటికి దానా అందించారు.

ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనల ఆలాపన, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన భజనలు, కోలాటాలు, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులు, పురప్రజలను ఆకట్టుకున్నాయి. డిపిపి ఆధ్వ‌ర్యంలో గో పూజ పుస్త‌కాల‌ను భ‌క్తుల‌కు అందించారు.

ఎస్వీ గోశాల సంచాలకులు డాక్టర్‌ కె.హరనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి డా..ర‌మ‌ణ ప్ర‌సాద్‌, విజివో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.