KODANDA RAMA AS VATAPATRASAI _ వటపత్రశాయి అలంకారంలో కోదండరాముని కటాక్షం

VONTIMITTA, 02 APRIL 2023: On the third day of ongoing annual brahmotsavams at Vontimitta Kodanda Ramalayam, Sri Rama in Vatapatrasai alankara blessed devotees.

 

Deputy EO Sri Natesh Babu, Manuscripts Special Officer Smt Vijayalakshmi and others were present.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వటపత్రశాయి అలంకారంలో కోదండరాముని కటాక్షం
 
ఒంటిమిట్ట, 2023 ఏప్రిల్ 02: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. ఉదయం 8 గంటల నుండి  స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
 
పురాణాల ప్రకారం.. జలప్రళయం సంభవించినపుడు శ్రీమహావిష్ణువు మర్రి ఆకుపై తేలియాడుతూ చిన్న శిశువుగా దర్శనమిస్తారు. కుడికాలి బొటనవేలిని నోటిలో పెట్టుకుని ఆస్వాదిస్తుంటారు. ఈ ఘట్టాన్ని గుర్తుచేస్తూ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు భక్తులకు కనువిందు చేశారు. భక్తుల కష్టాలను కడతేర్చేందుకు ఎప్పుడూ ముందుంటానని స్వామివారు ఈ అలంకారం ద్వారా తెలియజేస్తున్నారు. వటపత్రశాయి మహిమను అన్నమయ్య తన సంకీర్తనల్లో చక్కగా వర్ణించారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబు, ఏఈఓ శ్రీ గోపాలరావు, సూపరింటెండెంట్లు శ్రీ పి.వెంకటేశయ్య, శ్రీ ఆర్సీ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయ పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.