ELABORATE ARRANGEMENTS FOR SITA RAMA KALYANAM AT VONTIMITTA _ ఏప్రిల్ 5న ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు

AP CM TO PRESENT SILKS AND TALAMBRALU ON APRIL 5

 

TTD EO INSPECTS ARRANGEMENTS

 

VONTIMITTA, 02 APRIL 2023: As part of the ongoing annual brahmotsavams at Vontimitta Sri Kodanda Ramalayam, TTD EO Sri AV Dharma Reddy inspected the ongoing arrangements for the mega religious event of Sri Sita Rama Kalyanam on April 5.

 

Along with YSR District Collector Sri Vijayarama Raju and JEO Sri Veerabrahmam, the EO inspected the arrangements at Kalyana Vedika, CM Rest House, convoy route map, traffic regulations etc.

 

Later speaking to media persons the EO said, the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy will present Pattu Vastrams and Talambralu on behalf of the state government to Sri Kodandaramalayam temple at Vontimitta on April 5. 

 

“This year we will hand over the vermilion, turmeric, talambralu, annaprasadam packet besides the distribution of sufficient numbers of water and buttermilk packets while the devotees entering the galleries itself to witness Kalyanam so that they have no need to wait for these prasadams after the celestial wedding.

 

Joint Collector Sri Saikant Verma, Additional SP Sri Krishna Rao, Assistant Collector Sri Rahul Meena, SVBC CEO Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagdeeshwar Reddy, SE Electrical Sri Venkateswarulu, GM Transport Sri Sesha Reddy, VGO Sri Manohar, DFO Sri Srinivas, DyEOs Sri Natesh Babu, Sri Subramanyam, Sri Govindarajan, Sri Lokantham, Catering Special Officer Sri Shastry, Additional Health Officer Dr Sunil Kumar and others participated.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 5న ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు

– ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి

– ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

ఒంటిమిట్ట, 2023 ఏప్రిల్ 02: ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 5న జరగనున్న సీతారాముల కల్యాణానికి జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. కల్యాణం రోజున భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను ఆదివారం వైఎస్సార్ జిల్లా కలెక్టర్ శ్రీ విజయరామరాజుతో కలిసి ఈవో పరిశీలించారు. విభాగాల వారీగా జరుగుతున్న ఏర్పాట్లపై ఈవో సమీక్షించారు.

ఈ సందర్భంగా కల్యాణవేదిక వద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ కల్యాణం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నట్టు తెలిపారు. కల్యాణవేదిక వద్ద భక్తులు గ్యాలరీల్లోకి ప్రవేశించే ముందే ముత్యంతో కూడిన తలంబ్రాలు, పసుపుకుంకుమ, అన్నప్రసాదం ప్యాకెట్ అందిస్తామని, భక్తులు ఎలాంటి తొందరపాటు లేకుండా వీటిని స్వీకరించి సంతృప్తికరంగా కల్యాణాన్ని దర్శించాలని కోరారు. భక్తుల కోసం తగినన్ని మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు అందుబాటులో ఉంచుతామన్నారు.

అంతకు ముందు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఆలయ పరిపాలన భవనం వద్ద గల విశ్రాంతి గృహం, ఆలయం, పరిసర ప్రాంతాలు, కల్యాణవేదిక వద్ద చేపట్టిన ఏర్పాట్లను ఈవో క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈవో వెంట స్థానిక ఎమ్మెల్యే శ్రీ మేడా మల్లికార్జునరెడ్డి, టిటిడి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, జాయింట్ కలెక్టర్ శ్రీ సాయికాంత్ వర్మ, అదనపు ఎస్పీ శ్రీ కృష్ణారావు, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ రాహుల్ మీనా, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఎస్ఇ ఎలక్ట్రికల్ శ్రీ వెంకటేశ్వర్లు, విజివో శ్రీ మనోహర్, రవాణ విభాగం జిఎం శ్రీ శేషారెడ్డి, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్, డెప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ గోవిందరాజన్, శ్రీ లోకనాధం, శ్రీ గుణభూషణ్ రెడ్డి, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి, అదనపు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.