KOIL ALWAR TIRUMANJANAM AT NAGULAPURAM _ నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

TIRUPATI, 02 MAY 2023: In connection with annual brahmotsavams in Sri Veda Narayana Swamy temple from May 4-12, Koil Alwar Tirumanjanam was observed on Tuesday.

 

On May 3 Ankurarpanam will be observed while the annual fete commences with Dhwajarohanam on May 4.

 

Garuda Seva is on May 8, Rathotsavam and Kalyanam on May 11, Chakra Snanam on May 12.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

– మే 3న అంకురార్పణ

తిరుపతి, 2023 మే 02: నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి . బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, అర్చన జరిగింది. ఉదయం 6.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను మ‌ధ్యాహ్నం 1.30 గంటలకు దర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

మే 3న అంకురార్పణ :

శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. సాయంత్రం 6.15 నుండి 7.15 గంటల వరకు మృత్సోగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అంకురార్పణం జరుగనుంది.

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

04-05-2023 ధ్వజారోహణం పెద్దశేష వాహనం

05-05-2023 చిన్నశేష వాహనం హంస వాహనం

06-05-2023 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

07-05-2023 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

08-05-2023 మోహినీ అవతారం గరుడ వాహనం

09-05-2023 హనుమంత వాహనం గజ వాహనం

10-05-2023 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

11-05-2023 రథోత్సవం, ఆర్జితకల్యాణోత్సవం – అశ్వవాహనం

12-05-2023 చక్రస్నానం ధ్వజావరోహణం.

మే 11వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రూ.750/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.