JC PARTICIPATES IN SUDDHA TIRUMALA _ సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమంలో భాగస్వాములు కావడం పూర్వజన్మ సుకృతం- జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ
TIRUMALA, 02 MAY 2023: The Joint Collector of Tirupati district Sri Balaji participated in the cleaning activity programme in Tirumala on Tuesday.
Speaking on the occasion the JC said he is fortunate to take part in the cleaning program at the sacred hills. “The programme Sundara Tirumala-Suddha Tirumala has been mulled by TTD to serve the pilgrims without any hindrance is really appreciable. In fact it has set a role model to others also to keep their premises clean and hygienic”, he maintained.
The JC cleaned the entire area of Narayanagiri Gardens along with TTD employees and Srivari Sevaks.
TTD JEO for Health and Education Smt Sada Bhargavi led the cleansing activity on Tuesday in Tirumala with the TTD workforce on deputation and Srivari Sevaks.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమంలో భాగస్వాములు కావడం పూర్వజన్మ సుకృతం
– జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ
తిరుమల, 2023 మే 02: తిరుమల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా “సుందర తిరుమల-శుద్ధ తిరుమల” కార్యక్రమంలో తాము భాగస్వాములు కావడం పూర్వజన్మ సుకృతమని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ అన్నారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలలో మంగళవారం టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులతో కలిసి జాయింట్ కలెక్టర్ శ్రమదానం (స్వచ్ఛంద పరిశుభ్రత సేవ) నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, క్లిష్ట సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య నిర్వాహణలో మెరుయిన పరిశుభ్రత చర్యలు చేపట్టిన టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకుల సేవలను ఆయన అభినందించారు. అనంతరం ఉద్యోగులు, శ్రీవారి సేవకులతో కలిసి ఆయన నారాయణగిరి ఉద్యానవనాలను శుభ్రం చేశారు.
జెఈవో శ్రీమతి సదా భార్గవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.